Ind Vs SA 2nd T20: టాస్ గెలిచిన టీమిండియా
ABN , Publish Date - Dec 11 , 2025 | 07:04 PM
ముల్లాన్‌పూర్ వేదికగా మరోసారి తలపడేందుకు భారత్, దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి. అయితే, ఈసారి టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో, ఈ మ్యాచ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను ఘన విజయంతో ప్రారంభించిన టీమిండియా రెండో టెస్టుకూ సిద్ధమైంది. నేడు ముల్లాన్‌పూర్‌లోని మహారాజ యదవేంద్ర సింగ్ స్టేడియం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. అయితే, ఈసారి సంజూ శాంసన్‌కు నిరాశ ఎదురైంది. ప్లేయింగ్ లెవెన్‌లో అతడికి చోటు దక్కలేదు (Ind Vs SA 2nd T20, Ind Won Toss).
భారత్ ప్లేయింగ్ లెవెన్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), అర్షదీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ లెవెన్: క్వింటన్ డీకాక్ (వికెట్ కీపర్), ఎయిడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనొవాన్ ఫెరీరా, మార్కో యాన్సెన్, జార్జ్ లిండె, లుతో సిపామ్లా, లుంగీ ఎంగిడి, ఒట్నీల్ బార్ట్‌మన్
ఇవీ చదవండి:
సహచరుడికి ఇచ్చిన మాట..15 ఏళ్ల తర్వాత నిలబెట్టుకున్న సచిన్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. నెం.2గా కోహ్లీ