Share News

Womens World Cup: భారత్‌ పాక్‌ పోరు నేడు

ABN , Publish Date - Oct 05 , 2025 | 05:54 AM

మరో ఆదివారం..వరుసగా నాలుగోది. మళ్లీ చిరకాల ప్రత్యర్థుల సమరం. ఆసియా కప్‌లో భాగంగా గత మూడు ఆదివారాలు భారత్‌-పాకిస్థాన్‌ పురుషుల జట్లు తలపడితే ఈసారి మహిళల వంతు వచ్చింది. వన్డే ప్రపంచ కప్‌లో...

Womens World Cup: భారత్‌ పాక్‌ పోరు నేడు

భారత్‌, పాక్‌ పోరు నేడు

ఈరోజూ మనదే కావాలి

భారత సారథి హర్మన్‌ప్రీత్‌

పాక్‌ కెప్టెన్‌ సనా

మహిళల వన్డే ప్రపంచకప్‌

మ. 3 నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో

కొలంబో: మరో ఆదివారం..వరుసగా నాలుగోది. మళ్లీ చిరకాల ప్రత్యర్థుల సమరం. ఆసియా కప్‌లో భాగంగా గత మూడు ఆదివారాలు భారత్‌-పాకిస్థాన్‌ పురుషుల జట్లు తలపడితే ఈసారి మహిళల వంతు వచ్చింది. వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగే మ్యాచ్‌లో భారత్‌-పాకిస్థాన్‌ జట్లు ఢీకొననున్నాయి. అయితే పురుషుల క్రికెట్‌లో మాదిరే.. ఈ పోరులో భారత మహిళలే తిరుగులేని ఫేవరెట్లుగా బరిలో దిగుతున్నారు. రికార్డుల పరంగా చూసినా..ఈ మ్యాచ్‌ ఫలితమేమిటో ఇట్టే అర్థమవుతుంది. మహిళల అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అన్ని ఫార్మాట్లలో కలిపి భారత్‌-పాక్‌ జట్లు 27సార్లు తలపడ్డాయి. కానీ 24-3తో భారత మహిళలదే తిరుగులేని ఆధిపత్యం. పాక్‌ నెగ్గిన మూడు మ్యాచ్‌లు కూడా టీ20లు. వన్డేల్లో అయితే ప్రత్యర్థిపై భారత్‌ 100 శాతం రికార్డు కలిగి ఉండడం విశేషం. రెండు జట్లు 11 సార్లు ఢీకొంటే అన్నిసార్లు మన జట్టే గెలిచింది. ఈ వన్డే ప్రపంచ కప్‌లో రెండు జట్లు తమ ప్రస్థానాన్ని పరస్పర భిన్నంగా మొదలుపెట్టాయి. భారత్‌ తొలి మ్యాచ్‌లో 59 రన్స్‌తో శ్రీలంకపై నెగ్గింది. మరోవైపు ఫాతిమా సనా సారథ్యంలోని పాక్‌ 7 వికెట్లతో బంగ్లా చేతిలో ఓడింది. బంగ్లా పేస్‌, స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం పాక్‌ బ్యాటర్ల వల్ల కాకపోవడం గమనార్హం.

శ్రీలంక-ఆస్ట్రేలియా మ్యాచ్‌ రద్దు: భారీ వర్షంతో శ్రీలంక-ఆస్ట్రేలియా జట్ల నడుమ శనివారం కొలంబోలో జరగాల్సిన మ్యాచ్‌ రద్దయింది. దాంతో ఇరుజట్లకు చెరో పాయింట్‌ లభించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్‌ సీఎం

PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ

Updated Date - Oct 05 , 2025 | 05:56 AM