Share News

India Women Cricket: ఎవరిదో సిరీస్‌

ABN , Publish Date - Jul 22 , 2025 | 05:34 AM

మూడు వన్డేల సిరీ్‌సలో 1-1తో సమంగా ఉన్న భారత్‌-ఇంగ్లండ్‌ మహిళల జట్ల మధ్య నేడు (మంగళవారం) చివరి వన్డే జరుగనుంది. తొలి వన్డేలో బ్యాటర్లు విశేషంగా...

India Women Cricket: ఎవరిదో సిరీస్‌

నేడు భారత్‌ X ఇంగ్లండ్‌ మహిళల మూడో వన్డే

చెస్టర్‌ లీ స్ట్రీట్‌: మూడు వన్డేల సిరీ్‌సలో 1-1తో సమంగా ఉన్న భారత్‌-ఇంగ్లండ్‌ మహిళల జట్ల మధ్య నేడు (మంగళవారం) చివరి వన్డే జరుగనుంది. తొలి వన్డేలో బ్యాటర్లు విశేషంగా రాణించడంతో మ్యాచ్‌ నెగ్గిన భారత్‌.. వర్షాభావ రెండో మ్యాచ్‌లో మాత్రం బ్యాట్లెత్తేశారు. కేవలం మంధాన, దీప్తి శర్మ మాత్రమే ఆకట్టుకోగలిగారు. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడ్డారు. నేటి కీలక మ్యాచ్‌లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌, జెమీమా, ఓపెనర్‌ ప్రతీక, రిచా ఘోష్‌ తమ స్థాయికి తగ్గట్టు ఆడితే భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. అటు బౌలర్లు కూడా నిరాశపర్చడంతో లార్డ్స్‌లో సిరీస్‌ పట్టేయాలనుకున్న అమ్మాయిలకు నిరాశే ఎదురైంది. ఇక సిరీ్‌సలో కచ్చితంగా గెలవాల్సిన రెండో మ్యాచ్‌లో సివర్‌ సేన అదరగొట్టింది. అన్ని విభాగాల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం చూపింది. ఈ మూడో వన్డేలోనూ ఎలాంటి అలక్ష్యం లేకుండా చెలరేగి సిరీ్‌సను పట్టేయాలని భావిస్తోంది.

ఇవీ చదవండి:

బుమ్రా ఆడాల్సిందే

క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 05:34 AM