Batumi chess 2025: సెమీఫైనల్లో భారత్ చైనా
ABN , Publish Date - Jul 22 , 2025 | 05:43 AM
మహిళల చెస్ వరల్డ్‌కప్‌లో ఇద్దరు భారత ప్లేయర్లు కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ సెమీస్ చేరి సరికొత్త చరిత్ర సృష్టించారు. 2003 టోర్నీలో...
ఫైనల్-4కు దివ్య దేశ్‌ముఖ్
టైబ్రేక్‌లో హారికపై గెలుపు
మహిళల చెస్ వరల్డ్‌కప్
బటూమి (జార్జియా): మహిళల చెస్ వరల్డ్‌కప్‌లో ఇద్దరు భారత ప్లేయర్లు కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ సెమీస్ చేరి సరికొత్త చరిత్ర సృష్టించారు. 2003 టోర్నీలో ద్రోణవల్లి హారిక క్వార్టర్స్ చేరడం అత్యుత్తమం కాగా.. ఇప్పుడు హంపి, దివ్య ఆ రికార్డును అధిగమించారు. హంపి ముందుగానే ఫైనల్-4 బెర్త్‌ను సొంతం చేసుకోగా.. సోమవారం జరిగిన టైబ్రేక్‌లో సహచర జీఎం హారికపై గెలిచిన దివ్య సెమీ్‌సకు దూసుకెళ్లింది. కాగా, క్వార్టర్ ఫైనల్స్‌లో దివ్య 3-1తో హారికపై నెగ్గింది. వీరిమధ్య తొలి రెండు గేమ్‌లు డ్రా కావడంతో 1-1తో సమంగా నిలిచారు. అయితే, టైబ్రేక్‌లో రెండు గేముల్లోనూ హారికకు దివ్య ఝలక్ ఇచ్చింది. మొత్తంగా ఇద్దరు భారత మాస్టర్లు, ఇద్దరు చైనా ప్లేయర్లు ఫైనల్-4కు చేరుకోవడం విశేషం. మంగళవారం జరిగే సెమీ్‌సలో జీఎం లీ టింగ్జీతో హంపి, జీఎం టాన్ జోంగ్‌యితో దివ్య తలపడనున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి