India Under Pressure: పైచేయి ఎవరిదో
ABN , Publish Date - Dec 14 , 2025 | 06:33 AM
పొట్టి ఫార్మాట్‌లో తనస్థానాన్ని సుస్థిరం చేసుకొన్న సంజూ శాంసన్‌ను ఫణంగాపెట్టిన భారత్.. శుభ్‌మన్ గిల్‌కు జట్టులో చోటివ్వడం బెడిసికొడుతోం ది. దక్షిణాఫ్రికాతో ఆడిన రెండు టీ20ల్లోనూ గిల్ ఘోరంగా...
మూడో టీ20 నేడు
రాత్రి 7 గం. నుంచి గిల్‌కు కౌంట్‌డౌన్
సూర్య సత్తాచాటేనా ?
ఒత్తిడిలో భారత్
ఆత్మవిశ్వాసంలో దక్షిణాఫ్రికా
ధర్మశాల: పొట్టి ఫార్మాట్‌లో తనస్థానాన్ని సుస్థిరం చేసుకొన్న సంజూ శాంసన్‌ను ఫణంగాపెట్టిన భారత్.. శుభ్‌మన్ గిల్‌కు జట్టులో చోటివ్వడం బెడిసికొడుతోం ది. దక్షిణాఫ్రికాతో ఆడిన రెండు టీ20ల్లోనూ గిల్ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సలో భాగంగా ఆదివా రం జరిగే మూడో టీ20 గిల్ కెరీర్‌కు విషమ పరీక్షగా భావిస్తున్నారు. ఇదే పేలవ ఫామ్‌ను అతడు కొనసాగిస్తే.. టీ20 వరల్డ్‌కప్ కోసం టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రత్యామ్నాయాలు వెదకాల్సి రావచ్చు. ఇక, తనదైన శైలిలో మెరుపులు మెరిపించే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వరుసగా నిరాశపరుస్తుండడం కూడా జట్టుకు భారంగా మారింది. కాగా, తొలి మ్యాచ్‌లో గెలిచి తమకు తిరుగులేదనిపించుకొన్న భారత్.. చండీగఢ్‌లో దారుణంగా చతికిలపడింది. టాస్ గెలిచిన మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో విఫలమైన భారత్ చిత్తుగా ఓడడం ఫ్యాన్స్‌కు ఒక్కపట్టాన మింగుడుపడడం లేదు. ఈ క్రమంలో భారత జట్టుపై భారీగా ఒత్తిడి నెలకొంది. దీంతోపాటు సూర్య బ్యాటింగ్ ఆర్డర్‌పై పదేపదే ప్రయోగాలు చేయడం.. శివం దూబేను ఎనిమిదో నెంబర్‌లో దించడం విమర్శలకు దారితీసింది. తిలక్ వర్మ, జితేష్ ఫర్వాలేదనిపించినా.. హార్దిక్ పాండ్యా ఆశించిన రీతిలో ఆడలేదు. బౌలర్ల విషయానికొస్తే అర్ష్‌దీప్ సింగ్ నిరాశపర్చగా.. పేస్ స్టార్ బుమ్రా కూడా గతి తప్పాడు. దీంతో అర్ష్‌దీప్ స్థానంలో హర్షిత్ రాణాకు చాన్సిచ్చే అవకాశాలున్నాయి. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి లేదా కుల్దీ్‌పలో ఒకరికే అవకాశం. మరోవైపు సిరీ్‌సను 1-1తో సమం చేసిన సౌతాఫ్రికా ఫుల్‌జో్‌షలో ఉంది. డికాక్‌తోపాటు కెప్టెన్ మార్‌క్రమ్, బ్రెవిస్, ఫెరీరా దూకుడుగా ఆడతుండడం జట్టుకు ప్లస్ అవుతోంది. బౌలర్లు ఎన్‌గిడి, మార్కో యాన్సెన్, నోకియా, బార్ట్‌మన్ క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తున్నారు. మరోసారి వీరు చెలరేగితే సిరీ్‌సలో పైచేయి సాధించే అవకాశం ఉంది. అయితే, టీమిండియా కసిగా బదులు తీర్చుకోవాలనుకొంటోంది.
జట్లు (అంచనా)
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్ వర్మ, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్, అర్ష్‌దీ్‌ప/రాణా, వరుణ్, బుమ్రా.
సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్, మార్‌క్రమ్ (కెప్టెన్), స్టబ్స్/ హెం డ్రిక్స్, డెవాల్డ్ బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, యాన్సెన్, జార్జ్ లిండే/కేశవ్, ఎన్‌గిడి/బా్‌ష, బార్ట్‌మన్, నోకియా/సిపామ్లా.
పిచ్/వాతావరణం
ధర్మశాలలో గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఛే జింగ్ టీమ్ గెలిచింది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవ చ్చు. చలి ఎక్కువగా ఉండడంతో వికెట్ పేసర్లకు అనుకూలించవచ్చు. మొ త్తంమీద వాతావరణ పరి స్థితులు విజేతను నిర్ణ యించే అవకాశముంది.
ఇవీ చదవండి: