Asia Cup 2025 India Under 19: ఫైనల్లో యువ భారత్
ABN , Publish Date - Dec 20 , 2025 | 04:26 AM
వైస్-కెప్టెన్ విహాన్ మల్హోత్ర (45 బంతుల్లో 61 నాటౌట్), ఆరోన్ జార్జ్ (49 బంతుల్లో 58 నాటౌట్) చెలరేగడంతో అండర్-19 ఆసియా కప్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం...
శ్రీలంకపై ఘన విజయం
ఫైనల్లో పాక్‌తో అమీతుమీ
అండర్-19 ఆసియా కప్
దుబాయ్: వైస్-కెప్టెన్ విహాన్ మల్హోత్ర (45 బంతుల్లో 61 నాటౌట్), ఆరోన్ జార్జ్ (49 బంతుల్లో 58 నాటౌట్) చెలరేగడంతో అండర్-19 ఆసియా కప్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో యువ భారత్ 8వికెట్లతో శ్రీలంకను చిత్తు చేసింది. ఆదివారం జరిగే ఫైనల్లో పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై పాక్ నెగ్గింది. వర్షంవల్ల భారత్-లంక మ్యాచ్‌ను 20 ఓవర్ల చొప్పున కుదించారు. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 138/8 స్కోరు సాధించింది. హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్ చెరో రెండు వికెట్లు తీశారు. ఛేదనలో భారత్ 18 ఓవర్లలో 139/2 స్కోరు చేసి అలవోకగా నెగ్గింది. విహాన్, ఆరోన్ మూడో వికెట్‌కు అభేద్యంగా 114 పరుగులు జోడించారు. దాంతో విహాన్-ఆరోన్‌లకు సంయుక్తంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక రెండో సెమీఫైనల్‌నూ వర్షం వల్ల 27 ఓవర్ల చొప్పున నిర్ణయించారు. తొలుత బంగ్లా 26.3 ఓవర్లలో 121 రన్స్‌కు కుప్పకూలింది. సులువైన లక్ష్యాన్ని పాక్ 16.3 ఓవర్లలో 122/2 స్కోరుతో ఛేదించింది.
ఇవీ చదవండి:
రూపాయి పతనంపై దిగులొద్దు: సంజీవ్ సన్యాల్