Womens Cricket World Cup: కంగారూలతోనే సెమీస్ ఎందుకంటే
ABN , Publish Date - Oct 26 , 2025 | 03:07 AM
మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారత్ ప్రత్యర్థిగా ఆస్ట్రేలియా ఖరారైంది. శనివారం దక్షిణాఫ్రికాపై గెలిచి అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది...
మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారత్ ప్రత్యర్థిగా ఆస్ట్రేలియా ఖరారైంది. శనివారం దక్షిణాఫ్రికాపై గెలిచి అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ప్రస్తుతం పట్టికలో ఆస్ట్రేలియా (13), దక్షిణాఫ్రికా (10), ఇంగ్లండ్ (9), భారత్ (6) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ జట్లన్నీ ఇప్పటికే సెమీస్ చేరాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లను శనివారం ఆడేశాయి. ఆదివారం (అక్టోబరు 26న) జరిగే లీగ్ చివరి మ్యాచుల్లో బంగ్లాదేశ్‌తో భారత్, న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ తలపడనున్నాయి. వీటిల్లో ఇంగ్లండ్ గెలిస్తే 11 పాయింట్లతో రెండో స్థానానికి చేరుతుంది. దక్షిణాఫ్రికా మూడో స్థానానికి పడిపోతుంది. ఒకవేళ బంగ్లాపై నెగ్గినా భారత్ ఖాతాలో 8 పాయింట్లే ఉంటాయి కాబట్టి హర్మన్‌సేన నాలుగో స్థానంలో ఎలాంటి మార్పుండదు. కాబట్టి, తొలి స్థానంలో ఉన్న ఆసీ్‌సతో నాలుగో స్థానంలో ఉన్న భారత్ సెమీ్‌సలో ఆడాల్సి ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Gautam Gambhir's Reaction: రోహిత్ శర్మ 50వ సెంచరీ.. గంభీర్ అదిరిపోయే రియాక్షన్
Rohit Sharma: ఫీల్డింగ్‌లోనూ సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. అదెలాగంటే?