Share News

Asia Cup Hockey 2025: ఫైనల్లో భారత్‌

ABN , Publish Date - Sep 07 , 2025 | 05:07 AM

పురుషుల ఆసియాకప్‌ హాకీ టోర్నీలో భారత జట్టు ఫైనల్‌కు చేరింది. శనివారం చైనాతో జరిగిన సూపర్‌-4 ఆఖరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన ఏకంగా 7-0 తేడాతో ఘనవిజయం సాధించింది....

Asia Cup Hockey 2025: ఫైనల్లో భారత్‌

నేడు కొరియాతో అమీతుమీ

ఆసియా కప్‌ హాకీ

రాత్రి 7.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..

రాజ్‌గిర్‌: పురుషుల ఆసియాకప్‌ హాకీ టోర్నీలో భారత జట్టు ఫైనల్‌కు చేరింది. శనివారం చైనాతో జరిగిన సూపర్‌-4 ఆఖరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన ఏకంగా 7-0 తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్‌ తరఫున అభిషేక్‌ (46, 50వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో విజృంభించగా.. షీలానంద్‌ (4), దిల్‌ప్రీత్‌ సింగ్‌ (7), మన్‌దీ్‌ప సింగ్‌ (18), రాజ్‌కుమార్‌ పాల్‌ (37), సుఖ్‌జీత్‌ సింగ్‌ (39) తలో గోల్‌ చేశారు. ఈ గెలుపుతో భారత జట్టు సూపర్‌ 4 లీగ్‌ టేబుల్‌లో ఏడు పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ఇక నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన డిఫెండింగ్‌ చాంపియన్‌ దక్షిణ కొరియాతో భారత్‌ ఆదివారం జరిగే తుది పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. అంతకుముందు కొరియా 4-3తో మలేసియాను ఓడించింది. కాగా, టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌క్‌పనకు అర్హత సాధిస్తుంది. ఇక, చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న మహిళల ఆసియా కప్‌ హాకీ టోర్నీలో భారత్‌ రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జపాన్‌ను నిలువరించింది. శనివారం జపాన్‌తో జరిగిన పోరును భారత్‌ 2-2తో డ్రాగా ముగించింది. తొలి మ్యాచ్‌లో భారత్‌ 11-0తో థాయ్‌లాండ్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్‌ యాప్‌ కేసులో విచారణ..

కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 07 , 2025 | 05:07 AM