Share News

Womens Cricket World Cup: సెమీ్‌సకు భారత్‌

ABN , Publish Date - Oct 24 , 2025 | 05:30 AM

హ్యాట్రిక్‌ ఓటములతో డీలాపడిన భారత్‌.. మళ్లీ గెలుపు బాట పట్టింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్మృతి మంధాన (95 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109), ప్రతీక రావల్‌ (134 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 122) శతకాల మోతతో భారత్‌.. ప్రపంచ కప్‌లో...

Womens Cricket World Cup: సెమీ్‌సకు భారత్‌

నేటి మ్యాచ్‌

శ్రీలంక X పాకిస్థాన్‌

మ.3 నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో

53 పరుగులతో విజయం

  • ప్రతీక, మంధాన శతక మోత

  • న్యూజిలాండ్‌ అవుట్‌

ముంబై: హ్యాట్రిక్‌ ఓటములతో డీలాపడిన భారత్‌.. మళ్లీ గెలుపు బాట పట్టింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్మృతి మంధాన (95 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109), ప్రతీక రావల్‌ (134 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 122) శతకాల మోతతో భారత్‌.. ప్రపంచ కప్‌లో సెమీస్‌ బెర్త్‌ను ఖాయం చేసుకొంది. గురువారం జరిగిన వర్ష ప్రభావిత మ్యాచ్‌లో భారత్‌ 53 పరుగుల (డ/లూ పద్ధతి)తో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. మిగిలిన నాలుగో బెర్త్‌ హర్మన్‌సేన సొంతమవడంతో.. కివీస్‌ టోర్నీ నుంచి అవుటైంది. తొలుత భారత్‌ 49 ఓవర్లలో 3 వికెట్లకు 340 పరుగులు చేసింది. మెగా టోర్నీలో మనకిదే అత్యధిక స్కోరు. జెమీమా రోడ్రిగ్స్‌ (55 బంతుల్లో 11 ఫోర్లతో 76 నాటౌట్‌) దూకుడుగా ఆడింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. భారత ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత మరోసారి వరుణుడు పలకరించడంతో డక్‌వర్త్‌-లూయిస్‌ పద్ధతిలో కివీస్‌ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325 రన్స్‌గా సవరించారు. ఛేదనలో న్యూజిలాండ్‌ ఓవర్లన్నీ ఆడి 271/8 స్కోరు మాత్రమే చేసింది. హాలిడే (81), గేజ్‌ (65 నాటౌట్‌) అర్ధ శతకాలు వృథా అయ్యాయి. రేణుక, క్రాంతి చెరో 2 వికెట్లు పడగొట్టారు.

నెమ్మదిగా మొదలెట్టి..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు ప్రతీక, మంధాన.. తొలి వికెట్‌కు 212 పరుగుల భాగస్వామ్యంతో పటిష్ట పునాది వేశారు. 10 ఓవర్లలో భారత్‌ 40/0తో నిలిచింది. మంధాన.. జెస్‌ కెర్‌ బౌలింగ్‌లో సింగిల్‌తో టోర్నీలో తొలి శతకాన్ని నమోదు చేసింది. కానీ, స్మృతిని అవుట్‌ చేసి బేట్స్‌ జట్టుకు తొలి బ్రేక్‌ అందించింది. ఆ తర్వాత సింగిల్‌తో ప్రతీక శతకం సాధించగా.. జెమీమా బౌండ్రీలతో బౌలర్ల భరతం పట్టింది. కాగా, 43వ ఓవర్‌లో ప్రతీక క్యాచవుటైంది. అనంతరం కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (10) సహకారంతో ఫిఫ్టీ కొట్టిన రోడ్రిగ్స్‌.. జట్టు స్కోరును 300 దాటించింది.


స్కోరుబోర్డు

భారత్‌: ప్రతీక (సి/సబ్‌) రోవ్‌ (బి) కెర్‌ 122, మంధాన (సి/సబ్‌) రోవ్‌ (బి) బేట్స్‌ 109, జెమీమా (నాటౌట్‌) 76, హర్మన్‌ప్రీత్‌ (సి) కార్సన్‌ (బి) రోజ్‌మేరీ 10, రిచా ఘోష్‌ (నాటౌట్‌) 4, ఎక్స్‌ట్రాలు: 19; మొత్తం: 49 ఓవర్లలో 340/3; వికెట్ల పతనం: 1-212, 2-288, 3-336; బౌలింగ్‌: రోజ్‌మేరీ మెయిర్‌ 8-1-52-1, జెస్‌ కెర్‌ 8-1-51-0, డివైన్‌ 6-0-34-0, కార్సన్‌ 6-0-46-0, తహుహు 4-0-37-0, అమేలియా కెర్‌ 10-0-69-1, సుజీ బేట్స్‌ 7-0-40-1.

న్యూజిలాండ్‌: సుజీ బేట్స్‌ (సి) ప్రతీక (బి) క్రాంతి 1, ప్లిమ్మర్‌ (బి) రేణుక 30, అమేలియా కెర్‌ (సి) మంధాన (బి) రాణా 45, డివైన్‌ (బి) రేణుక 6, హాలిడే (సి) రాణా (బి) శ్రీచరణి 81, గ్రీన్‌ (సి) క్రాంతి (బి) ప్రతీక 18, ఇసబెల్లా (నాటౌట్‌) 65, జెస్‌ కెర్‌ (సి) మంధాన (బి) క్రాంతి 18, రోజ్‌మేరీ (సి) మంధాన (బి) దీప్తి 1, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 44 ఓవర్లలో 271/8; వికెట్ల పతనం: 1-1, 2-51, 3-59, 4-115, 5-154, 6-226, 7-266, 8-271; బౌలింగ్‌: రేణుక 6-0-25-2, క్రాంతి గౌడ్‌ 9-0-48-2, స్నేహ్‌ రాణా 8-0-60-1, శ్రీచరణి 9-0-58-1, దీప్తి 8-0-57-1, ప్రతీక 4-0-19-1.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా ర.రే

ఆస్ట్రేలియా 6 5 0 1 11 1.704

దక్షిణాఫ్రికా 6 5 1 0 10 0.276

ఇంగ్లండ్‌ 6 4 1 1 9 1.024

భారత్‌ 6 3 3 0 6 0.628

న్యూజిలాండ్‌ 6 1 3 2 4 -0.490

శ్రీలంక 6 1 3 2 4 -1.035

బంగ్లాదేశ్‌ 6 1 5 0 2 -0.578

పాకిస్థాన్‌ 6 0 4 2 2 -2.651

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

పా: పాయింట్లు; ఫ.తే: ఫలితం తేలనవి; ర.రే: రన్‌రేట్‌

మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధికంగా 17 శతకాలు సాధించిన మెగ్‌ లానింగ్‌ రికార్డును మంధాన సమం చేసింది. కాగా, వన్డేల్లో 14వ సెంచరీ సాధించిన స్మృతి.. లానింగ్‌ (15 శతకాలు) తర్వాతి స్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి..

IND VS AUS: రెండో వన్డేలోనూ భారత్ ఓటమి

Virat Kohli Emotional: అడిలైడ్‌ మ్యాచ్‌లో భావోద్వేగానికి గురైన విరాట్ కోహ్లీ

Updated Date - Oct 24 , 2025 | 05:30 AM