Share News

India Lead Against Switzerland: తొలిరోజు మనదే

ABN , Publish Date - Sep 13 , 2025 | 02:47 AM

డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌-1లో భాగంగా ఆతిథ్య స్విట్జర్లాండ్‌తో పోరులో తొలిరోజు భారత్‌దే పైచేయి అయింది. శుక్రవారం జరిగిన సింగిల్స్‌, రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచుల్లో భారత ఆటగాళ్లు గెలవడంతో...

India Lead Against Switzerland: తొలిరోజు మనదే

  • సింగిల్స్‌లో దక్షిణేశ్వర్‌, సుమిత్‌ గెలుపు

  • భారత్‌ 2-0 ఫ స్విట్జర్లాండ్‌తో డేవిస్‌ కప్‌

బీల్‌ (స్విట్జర్లాండ్‌): డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌-1లో భాగంగా ఆతిథ్య స్విట్జర్లాండ్‌తో పోరులో తొలిరోజు భారత్‌దే పైచేయి అయింది. శుక్రవారం జరిగిన సింగిల్స్‌, రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచుల్లో భారత ఆటగాళ్లు గెలవడంతో 2-0 ఆధిక్యం లభించింది. అయితే, ప్రధానంగా తొలిసారి డేవిస్‌ కప్‌ ఆడుతున్న తమిళనాడుకు చెందిన దక్షిణేశ్వర్‌ సురేష్‌ తనకంటే మెరుగైన ర్యాంకరైన ప్రత్యర్థిని ఓడించడం మొదటిరోజు ఆటలో విశేషం. తొలి సింగిల్స్‌లో 626వ ర్యాంకర్‌ దక్షిణేశ్వర్‌ 7-6 (5), 6-3తో 155వ ర్యాంకరైన జెరోమ్‌ కిమ్‌ను చిత్తు చేసి సంచలనం సృష్టించాడు. అనంతరం జరిగిన రివర్స్‌ సింగిల్స్‌లో అనుభవజ్ఞుడైన సుమిత్‌ నగల్‌ 6-3, 7-6(4)తో మార్క్‌ అండ్రియా హస్లెర్‌పై గెలిచి భారత్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించాడు. ఇక, శనివారం జరిగే డబుల్స్‌ మ్యాచ్‌లో శ్రీరామ్‌ బాలాజీ/బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరి జోడీ బరిలోకి దిగనుంది.

ఇవి కూడా చదవండి

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్

ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 13 , 2025 | 02:47 AM