India Clinches Innings Victory: మూడ్రోజుల్లోనే ముగించారు
ABN , Publish Date - Oct 05 , 2025 | 05:50 AM
సొంతగడ్డపై టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. రవీంద్ర జడేజా (104 నాటౌట్, 4/54) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో.. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది..
తొలి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ విజయం
విండీస్ 146 ఆలౌట్
తిప్పేసిన జడేజా
అహ్మదాబాద్: సొంతగడ్డపై టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. రవీంద్ర జడేజా (104 నాటౌట్, 4/54) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో.. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరో రెండు రోజుల ఆట మిగిలుండగానే నెగ్గిన భారత్ రెండు టెస్ట్‌ల సిరీ్‌సలో 1-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. రెండో, ఆఖరి టెస్ట్ ఈ నెల 10 నుంచి ఢిల్లీలో జరగనుంది. ఓవర్‌నైట్ స్కోరు 448/5 వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. విండీస్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు (162)కు 286 రన్స్ ఆధిక్యాన్ని నమోదు చేసింది. ఆటకు మూడో రోజైన శనివారం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన విండీస్ 146 పరుగులకే కుప్పకూలింది. అథనజె (38) టాప్ స్కోరర్. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జడేజా 4, సిరాజ్ 3, కుల్దీప్ 2 వికెట్లు తీశారు.
పేకమేడలా..: తొలి సెషన్‌లో పిచ్ బౌలర్లకు సహకరిస్తున్న వేళ విండీస్ కనీస పోరాటం కూడా చేయలేదు. సిరాజ్ బౌలింగ్‌లో నితీశ్ అందుకొన్న క్యాచ్‌తో ఓపెనర్ చందర్‌పాల్ (8) పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన అథనజె వికెట్‌ను అంటిపెట్టుకొన్నా.. మరో ఓపెనర్ క్యాంప్‌బెల్ (14), బ్రండన్ కింగ్ (5)ను జడ్డూ వెనక్కిపంపాడు. కెప్టెన్ చేజ్ (1)ను కుల్దీప్.. హోప్ (1)ను జడేజా అవుట్ చేయడంతో.. లంచ్ సమయానికి విండీస్ 66/5తో ఓటమి దిశగా సాగింది. తిరిగి వచ్చాక అథనజెను సుందర్.. గ్రీవ్స్ (25), వారికన్ (0)ను సిరాజ్ అవుట్ చేయడంతో విండీస్ ఓటమి ఖరారైంది. జొహన్ (14)ను జడేజా.. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన సీల్స్ (22)ను కుల్దీప్ పెవిలియన్ చేర్చారు. దీంతో రెండు సెషన్లు కూడా పూర్తి కాకుండానే కరీబియన్ల కథ ముగిసింది.
స్కోరుబోర్డు
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్: 162 ఆలౌట్; భారత్ తొలి ఇన్నింగ్స్: 448/5 డిక్లేర్డ్;
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: క్యాంప్‌బెల్ (సి) సుదర్శన్ (బి) జడేజా 14, చందర్‌పాల్ (సి) నితీశ్ (బి) సిరాజ్ 8, అథనజె (సి అండ్ బి) సుందర్ 38, కింగ్ (సి) రాహుల్ (బి) జడేజా 5, చేజ్ (బి) కుల్దీప్ 1, హోప్ (సి) జైస్వాల్ (బి) జడేజా 1, గ్రీవ్స్ (ఎల్బీ) సిరాజ్ 25, పియర్రీ (నాటౌట్) 13, వారికన్ (సి) గిల్ (బి) సిరాజ్ 0, లేన్ (సి) సిరాజ్ (బి) జడేజా 14, సీల్స్ (సి అండ్ బి) కుల్దీప్ 22; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 45.1 ఓవర్లలో 146 ఆలౌట్; వికెట్ల పతనం: 1-12, 2-24, 3-34, 4-35, 5-46, 6-92, 7-98, 8-98, 9-122, 10-146; బౌలింగ్: బుమ్రా 6-1-16-0, సిరాజ్ 11-2-31-3, జడేజా 13-3-54-4, కుల్దీప్ 8.1-3-23-2, సుందర్ 7-1-18-1.
10
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాధించిన జడేజా.. అత్యధికంగా 10సార్లు ఈ అవార్డును అందుకొన్న కోహ్లీ, అశ్విన్, కుంబ్లే సరసన నిలిచాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్ సీఎం
PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ