Deaflympics: ప్రాంజలి జోడీకి పసిడి
ABN , Publish Date - Nov 20 , 2025 | 06:32 AM
బధిర ఒలింపిక్స్ (డెఫ్లింపిక్స్)లో భారత షూటర్లు మరో స్వర్ణ పతకాన్ని మన ఖాతాలో చేర్చారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్లో ప్రాంజలి ధూమల్/అభినవ్ దేశ్వాల్ ద్వయం పసిడి దక్కించుకుంది...
కుశాగ్రకు కాంస్యం
బధిర ఒలింపిక్స్
టోక్యో: బధిర ఒలింపిక్స్ (డెఫ్లింపిక్స్)లో భారత షూటర్లు మరో స్వర్ణ పతకాన్ని మన ఖాతాలో చేర్చారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్లో ప్రాంజలి ధూమల్/అభినవ్ దేశ్వాల్ ద్వయం పసిడి దక్కించుకుంది. ఫైనల్లో ప్రాంజలి జోడీ 16-6తో చైనీస్ తైపీ జంట యా జు కావో/మింగ్ జుయి సూను చిత్తుచేసి విజేతగా నిలిచింది. ఇరాన్ ద్వయానికి కాంస్యం దక్కింది. ఇక, 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో కుశాగ్రసింగ్ రజావత్ కాంస్యం నెగ్గి బుధవారం భారత్‌కు రెండో పతకాన్ని అందించాడు. ఫైనల్స్‌లో కుశాగ్ర 224.3 స్కోరుతో మూడోస్థానంలో నిలిచాడు. ఇప్పటిదాకా టోర్నీలో భారత షూటర్లు మొత్తం 11 పతకాలు కొల్లగొట్టారు.
ఇవి కూడా చదవండి:
Venkatesh Iyer T20 XI: ఆల్‌టైమ్ టీ20 జట్టు.. రోహిత్, కోహ్లి దక్కని చోటు!
IND VS SA: ఘోరంగా విఫలమైన అభిషేక్, తిలక్, రుతురాజ్.. భారత్ ఓటమి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి