Asia Volleyball Championship: ఆసియా వాలీబాల్‌లో కుర్రాళ్ల కంచుమోత
ABN , Publish Date - Jul 20 , 2025 | 04:37 AM
ఆసియా పురుషుల అండర్-16 వాలీబాల్ చాంపియన్‌షి్‌పలో భారత కుర్రాళ్లు కంచు మోత మోగించారు. టోర్నీలో తలపడ్డ తొలిసారే కాంస్య పతకంతో సత్తా చాటారు...
న్యూఢిల్లీ: ఆసియా పురుషుల అండర్-16 వాలీబాల్ చాంపియన్‌షి్‌పలో భారత కుర్రాళ్లు కంచు మోత మోగించారు. టోర్నీలో తలపడ్డ తొలిసారే కాంస్య పతకంతో సత్తా చాటారు. థాయ్‌లాండ్‌లో శనివారం జరిగిన కాంస్య పతక పోరులో భారత్ 3-2తో జపాన్ జట్టును ఓడించి మూడోస్థానంతో పోడియం ఫినిష్ చేసింది. అంతకుముందు భారత్ సెమీఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలైంది. ఇక, ఈ టోర్నీలో సెమీస్ చేరిన భారత్, పాకిస్థాన్, జపాన్, ఇరాన్ జట్లు వచ్చే ఏడాది కతార్‌లో జరిగే అండర్-17 ప్రపంచ వాలీబాల్ చాంపియన్‌షి్‌పకు అర్హత సాధించాయి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి