Share News

Ind Vs WI Live: వెస్టిండీస్‌తో తొలి టెస్టు.. టీమిండియాకు సునాయాస విజయం

ABN , Publish Date - Oct 04 , 2025 | 02:12 PM

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 140 పరుగుల తేడాతో సునాయాస విజయం అందుకుంది. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక వెస్డింటీస్ మూడో రోజున కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

Ind Vs WI Live: వెస్టిండీస్‌తో తొలి టెస్టు.. టీమిండియాకు సునాయాస విజయం
India beats West Indies by 140 runs

ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా సునాయాస విజయం సాధించింది. మూడో రోజు ఆటలో ప్రత్యర్థిని 146 పరుగులకే ఆలౌట్ చేసిన భారత జట్టు 140 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. రెండో రోజు 448 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో, ఐదు వికెట్లు మిగిలుండగానే భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. ఫలితంగా 286 పరుగుల లక్ష్యంతో మూడో రోజును ప్రారంభించిన వెస్టిండీస్ ఆదిలోనే ఘోరంగా తడబడింది. నేడు లంచ్ సమయానికి ముందే ఐదు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది (Ind Beats WI in Ahmedabad Test).


లంచ్ తరువాత కూడా అదే తడబాటుకు లోనైన ప్రత్యర్థి జట్టు టీ బ్రేక్ వరకూ కూడా కొనసాగ లేక చతికిలపడిపోయింది. వెస్టిండీస్ బ్యాటర్‌లలో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరును చేయగలిగారు. అలిక్ అథనేజ్ (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జస్టిన్ గ్రీవ్స్ 25 పరుగులు చేశారు. క్యాంపెబెల్ 14 పరుగుల చేసి వెనుదిరిగాడు. ఇక టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 4, మహ్మద్ సిరాజ్ 3, కుల్‌దీప్ యాదవ్ 2, వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్‌ను తీశారు. ఈ టోర్నీలో ప్రస్తుతం భారత్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది.


ఇవి కూడా చదవండి

India Dominate: త్రిశతక మోత

పాక్ క్రికెట్‌లో సంక్షోభం.. నఖ్వీ రాజీనామా చేయాలని అఫ్రీది డిమాండ్..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 04 , 2025 | 02:53 PM