Toss Sets Record: టాస్‌లో అరుదైన రికార్డు సృష్టించిన భారత్.. ఏకంగా 19 సార్లు
ABN , Publish Date - Nov 30 , 2025 | 02:44 PM
ఇవాళ(ఆదివారం) రాంచి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. ఇక టాస్ విషయంలో భారత్ ఓ రికార్డును క్రియేట్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్, సౌతాఫ్రికా మధ్య రాంచి వేదికగా ఇవాళ(ఆదివారం) తొలి వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్ లో టీమిండియా వైట్ వాష్ కు గురైన సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ ను ఎలాగైన గెలవాలని పట్టుదలతో టీమిండియా ఉంది. ఇది ఇలా ఉంటే టాస్ విషయంలో భారత్ ఓ రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. వరుసగా 19 వన్డే మ్యాచుల్లో టాస్ ఓడిన జట్టుగా భారత్ నిలిచింది.
2023 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ నుంచి ఇప్పటి వరకు వన్డేలో టీమిండియా టాస్ లు ఓడిపోతూ వస్తోంది. భారత్ తర్వాత రెండో స్థానంలో నెదర్లాండ్ ఉంది. ఈ జట్టు 11 వన్డే మ్యాచుల్లో టాస్ ఓడింది. 2011 మార్చి నుంచి 2013 ఆగష్టు మధ్య కాలంలో నెదర్లాండ్ జట్టు వరుసగా 11 సార్లు టాస్ ఓడింది. భారత్ వరుస టాస్ ఓటములు టీమిండియా క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి టాస్ ఓటముల్లో భారత్ టాప్ ప్లేస్ లో ఉంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆచితూచి ఆడుతూ.. స్కోర్ బోర్డును కదిలిస్తున్నారు. దూకుడుగా ఆడుతున్న జైస్వాల్ (18) నాంద్రే బర్గర్ బౌలింగ్‌లో (3.1) వికెట్ కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 25 పరుగుల వద్ద టీమ్‌ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. తాను ఎదుర్కొన్న మొదటి బంతినే ఫోర్ కొట్టాడు.
ఇవి కూడా చదవండి:
రో-కో జోడీ రాహుల్‌కి బలం: బవుమా
విరాట్‌కు కలిసొచ్చిన కేఎల్ కెప్టెన్సీ.. సెంచరీ రిపీట్ అవ్వనుందా?