Share News

IND vs SA: విరాట్ విశ్వరూపం.. దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం..

ABN , Publish Date - Nov 30 , 2025 | 05:31 PM

టీమిండియా స్టార్ క్రికెటర్, కింగ్ కోహ్లీ సూపర్ సెంచరీ సాధించడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాంచీలో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారీ స్కోరు సాధించింది.

IND vs SA: విరాట్ విశ్వరూపం.. దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం..
Virat Kohli century

టీమిండియా స్టార్ క్రికెటర్, కింగ్ కోహ్లీ సూపర్ సెంచరీ సాధించడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాంచీలో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లీ (120 బంతుల్లో 135)తో పాటు రోహిత్ శర్మ, కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్ధశతకాలు చేశారు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది.


భారత్ ఇన్నింగ్స్ లో 25 పరుగుల వద్ద జైస్వాల్ (18) ఔట్ కాగా.. వన్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ .. ఆది నుంచే దూకుడుగా ఆడాడు. రోహిత్, కోహ్లీ ఇద్దరూ నువ్వానేనా అన్నట్లు పరుగులు రాబట్టడంలో పోటీ పడ్డారు. ఈ క్రమంలో 57 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 134 పరుగులు జోడించారు. రోహిత్ అవుటైన తర్వాత కూడా విరాట్ నిలకడగా ఆడి సెంచరీ సాధించాడు. 120 బంతుల్లో 7 సిక్స్‌లు, 11 ఫోర్లుతో 135 పరుగులు చేశాడు.


చివర్లో కేఎల్ రాహుల్ (60) అర్ధశతకం సాధించాడు. రవీంద్ర జడేజా (20 బంతుల్లో 32 పరుగులు) వేగంగా పరుగులు చేశాడు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ముందు 350 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో బర్గర్, బార్ట్‌మెన్, యన్‌నెస్, బాష్ రెండేసి వికెట్లు తీశారు.


ఇవి కూడా చదవండి:

టాస్‌లో అరుదైన రికార్డు సృష్టించిన భారత్.. ఏకంగా 19 సార్లు

రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. వన్డేలో తొలి ప్లేయర్‌గా

Updated Date - Nov 30 , 2025 | 05:45 PM