Ind vs Pak: 36 ఓవర్లు.. 5 వికెట్లు.. 165 పరుగులు..!
ABN , Publish Date - Feb 23 , 2025 | 05:26 PM
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ (Ind vs Pak) క్రికెట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ కాస్త నెమ్మదిగా ఆడుతోంది. బ్యాటర్ల ఆచితూచి ఆడుతున్నారు

క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ (Ind vs Pak) క్రికెట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ కాస్త నెమ్మదిగా ఆడుతోంది. బ్యాటర్ల ఆచితూచి ఆడుతున్నారు. పాక్ ఓపెనర్ బాబర్ అజామ్ (23)ను హార్దిక్ పాండ్యా పెవిలియన్‌కు చేర్చాడు. మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (25 బంతుల్లో 10) రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ రిజ్వాన్, షకీల్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదు చేశారు.
వేగంగా ఆడే క్రమంలో రిజ్వాన్ (77 బంతుల్లో 46), షకీల్ (76 బంతుల్లో 62) వెంట వెంటనే అవుటయ్యారు. భారత ఫీల్డర్లు క్యాచ్‌లను జారవిడవడం కూడా వీరికి కలిసి వచ్చింది. అక్షర్, హార్దిక్ ఈ రెండు వికెట్లను దక్కించుకున్నారు. ఆ తర్వాత తాహిర్ (4)ను జడేజా బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం 36 ఓవర్లలో పాకిస్తాన్ 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. పాకిస్తాన్ 250 పరుగుల లోపే టార్గెట్ ఫిక్స్ చేస్తుందని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు (Champions Trophy).
ప్రస్తుతం సల్మాన్ (5), కుష్‌దిల్ (1) క్రీజులో ఉన్నారు. స్పిన్నర్లు బౌలింగ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా ఓటమి పాలైతే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ దాదాపు నిష్క్రమించినట్టే. అందుకే ఈ మ్యాచ్‌ను పాకిస్తాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాగా, టీమిండియా గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన టీమ్‌తోనే మార్పులేమీ లేకుండా బరిలోకి దిగింది. పాకిస్తాన్ మాత్రం గత మ్యాచ్‌తో పోల్చుకుంటే ఓ మార్పుతో బరిలోకి దిగింది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..