Champions Trophy Final: ఫైనల్లో టీమిండియా గెలిస్తే ఎన్ని కోట్ల లాభమో తెలుసా.. ప్రైజ్‌మనీ ఎంతంటే..
ABN , Publish Date - Mar 07 , 2025 | 08:10 PM
మెగా ఫైనల్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. లీగ్ దశలో ఇదే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా విజయం సాధించింది. ఫైనల్లో కూడా అదే ఫీట్‌ను రిపీట్ చేస్తే టీమిండియాను కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ వరించనుంది.

ఎంతో రసవత్తరంగా సాగి, క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) చివరి అంకానికి చేరుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు సమయం దగ్గర పడుతోంది. భారత్, న్యూజిలాండ్ జట్లు హోరాహోరీ పోరుకు సిద్దమవుతున్నాయి. మెగా ఫైనల్ (Champions Trophy Final) కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. లీగ్ దశలో ఇదే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా (Ind vs NZ) విజయం సాధించింది. ఫైనల్లో కూడా అదే ఫీట్‌ను రిపీట్ చేస్తే టీమిండియాను కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ వరించనుంది.
2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టైటిల్ విజేతకు భారీగా డబ్బులు వచ్చిపడతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ప్రైజ్‌మనీ మొత్తం రూ.60.6 కోట్లు. ఈ టోర్నీలో పాల్గొన్న ఒక్కో జట్టు రూ.1.08 కోట్లు అందుకుంటుది. అలాగే గ్రూప్ స్టేజ్‌లో విజయం సాధించిన జట్టుకు రూ.29.5 లక్షలు అందుతాయి. అంటే న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌లు గెలిచింది కాబట్టి ఆ జట్టుకు దాదాపు రూ.59 లక్షలు అందుతాయి. అలాగే మొత్తం మూడు మ్యాచ్‌లనూ గెలిచిన టీమిండియాకు రూ.88 లక్షలు అందుతాయి (Champions Trophy prize money).
ఇక, ప్రైజ్‌మనీలో మిగిలిన డబ్బు రూ.30 కోట్లను ఫైనల్ విన్నర్, రన్నర్‌లకు పంచుతారు. ఫైనల్‌లో గెలిచిన జట్టు ఏకంగా రూ.19.49 కోట్ల ప్రైజ్‌మనీ అందుకబోతోంది. ఫైనల్ మ్యాచ్‌లో ఓడి రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.9.74 కోట్లు ఇస్తారు. ఒకవేళ ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. ఈ టోర్నీ ఆడినందుకు రూ.21.4 కోట్లు అందుకోబోతోందన్నమాట. ఒకవేళ ఈ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే రూ. 21.1 కోట్లు తమ దేశానికి తీసుకెళ్తుంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..