IND vs AUS: టాస్ మళ్లీ ఆస్ట్రేలియాదే.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..
ABN , Publish Date - Oct 23 , 2025 | 09:03 AM
ఆస్ట్రేలియాలో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ప్రారంభించింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా చాలా నెలల తర్వాత ఆస్ట్రేలియాలో ఓ వన్డే సిరీస్ ఆడబోతోంది. అలాగే ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఓ వన్డే సిరీస్ ఆడనుంది.
ఆస్ట్రేలియాలో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ రోజు ఆడిలైడ్‌లో రెండో వన్డే మ్యాచ్ జరగబోతోంది. మొదటి వన్డేలో ఘోర ఓటమిని చవిచూసిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని కృతినిశ్చయంతో ఉంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా దాదాపు ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఓ వన్డే సిరీస్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆడిలైడ్‌లో రెండో వన్డే మ్యాచ్ ప్రారంభం కాబోతోంది (India vs Australia 2025).
ఈ వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టుకు మిచెల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు (IND vs AUS toss). దీంతో టీమిండియా బ్యాటింగ్‌కు రెడీ అవుతోంది. మొదటి మ్యాచ్ ఆడిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగుతోంది. వాతావరణం బాగుందని, మెరుగ్గా ఆడి ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం ఉంచుతామని కెప్టెన్ గిల్ పేర్కొన్నాడు. అయితే టాస్ గెలిచి ఉంటే తాము కూడా బౌలింగే ఎంచుకునేవారమన్నాడు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్
ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, మాథ్యూ షార్ట్, అలెక్స్ క్యారీ, మ్యాట్ రెన్‌షా, కూపర్ కానోలి, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జేవియర్ బార్ట్‌లెట్, జోష్ హాజెల్‌వుడ్
ఇవి కూడా చదవండి..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..
సత్య నాదెళ్ల వేతనం రూ.850 కోట్లు
మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..