ICC Penalizes MCG Pitch: ఎంసీజీకి ఓ పాయింట్ జరిమానా
ABN , Publish Date - Dec 30 , 2025 | 06:37 AM
ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన యాషెస్ నాలుగో టెస్ట్ పిచ్‌పై ఐసీసీ తీవ్ర అసంతృప్తి ప్రకటించింది....
పిచ్‌పై ఐసీసీ అసంతృప్తి
దుబాయ్: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన యాషెస్ నాలుగో టెస్ట్ పిచ్‌పై ఐసీసీ తీవ్ర అసంతృప్తి ప్రకటించింది. బౌలర్లకు మరీ ఎక్కువగా సహకరించేలా వికెట్‌ను ఉన్నదని పేర్కొంది. ఈ క్రమంలో పిచ్‌పై ఒక డీమెరిట్ పాయింట్ జరిమానాగా విధించింది. కేవలం 142 ఓవర్లు మాత్రమే సాగిన ఈ బాక్సింగ్ డే టెస్ట్‌లో తొలిరోజు 20, రెండోరోజు 16 వికెట్లు నేలకూలిన సంగతి తెలిసింది. కేవలం రెండు రోజుల్లో ముగిసిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ నాలుగు వికెట్లతో గెలుపొందింది.
ఇవి కూడా చదవండి
రిటైర్‌మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్
మూడో రౌండ్ నుంచి రో-కో ఔట్.. కారణం ఏంటంటే..?