Hyderabads Aaron George: ఇండియా బి కెప్టెన్ ఆరోన్
ABN , Publish Date - Nov 12 , 2025 | 05:15 AM
ముక్కోణపు సిరీ్‌సలో భాగంగా అఫ్ఘానిస్థాన్ అండర్-19 జట్టుతో ఆడే ఇండియా-ఎ, బి జట్లను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఇందులో ఇండియా-బి జట్టుకు హైదరాబాదీ ఆరోన్ జార్జ్ కెప్టెన్‌గా...
ముంబై: ముక్కోణపు సిరీ్‌సలో భాగంగా అఫ్ఘానిస్థాన్ అండర్-19 జట్టుతో ఆడే ఇండియా-ఎ, బి జట్లను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఇందులో ఇండియా-బి జట్టుకు హైదరాబాదీ ఆరోన్ జార్జ్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఈనెల 17 నుంచి 30 వరకు ఈ సిరీస్ జరగనుంది. ఈ రెండు జట్లలో కలిపి నలుగురు హైదరాబాద్ క్రికెటర్లకు చోటు లభించడం విశేషం. ఇండియా-ఎ జట్టుకు వాఫీ డైమండ్, అలంక్రిత్ రాపోలు, మొహమ్మద్ మాలిక్, ఇండియా-బి జట్టుకు ఆరోన్ జార్జ్ ఎంపికయ్యారు. ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో ఆడుతున్న ఇండియా-ఎ జట్టులో సభ్యుడిగా ఉన్నందున వైభవ్ సూర్యవంశీని, రంజీ ట్రోఫీలో ఆడుతున్నందున ఆయుష్ మాత్రేను ఈ సిరీస్ పరిగణనలోనికి తీసుకోలేదు.
ఇవి కూడా చదవండి:
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..
లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..