జమ్మూ కశ్మీర్‌పై హైదరాబాద్ విజయం
ABN , Publish Date - Dec 05 , 2025 | 06:04 AM
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళుతోంది. గురువారం జమ్మూ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు విశేషంగా...
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ
కోల్‌కతా: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళుతోంది. గురువారం జమ్మూ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు విశేషంగా రాణించడంతో 4 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో గ్రూప్ ‘బి’లో టాప్ (16)లో నిలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కశ్మీర్ 19.3 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. మిలింద్, నితిన్ సాయిలకు మూడేసి.. రక్షణ్‌కు రెండు వికెట్లు దక్కాయి. స్వల్ప ఛేదనలో హైదరాబాద్ 15.1 ఓవర్లలో 115/6 స్కోరుతో నెగ్గింది. కశ్మీర్ బౌలర్లు చెలరేగడంతో హైదరాబాద్ 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఈ దశలో తనయ్ ఎదురుదాడికి అర్ధసెంచరీ (50)తో ఆదుకున్నాడు. ప్రజ్ఞయ్ రెడ్డి (31 నాటౌట్) సహకరించాడు.
ఈ వార్తలు కూడా చదవండి
'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!
పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత
Read Latest AP News And Telugu News