Share News

Syed Mushtaq Ali Trophy: సూపర్‌ లీగ్‌కు హైదరాబాద్‌

ABN , Publish Date - Dec 09 , 2025 | 05:44 AM

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ గ్రూప్‌-బి టాపర్‌గా హైదరాబాద్‌ సూపర్‌ లీగ్‌కు అర్హత సాధించింది. సోమవారం చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 4 వికెట్ల తేడాతో...

Syed Mushtaq Ali Trophy: సూపర్‌ లీగ్‌కు హైదరాబాద్‌

కోల్‌కతా: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ గ్రూప్‌-బి టాపర్‌గా హైదరాబాద్‌ సూపర్‌ లీగ్‌కు అర్హత సాధించింది. సోమవారం చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 4 వికెట్ల తేడాతో చండీగఢ్‌ చేతిలో ఓటమిపాలైంది. అయినా, మొత్తం 20 పాయింట్లతో హైదరాబాద్‌ బెర్త్‌ను ఖాయం చేసుకొంది. అయితే, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గోవా తలో 16 పాయింట్లతో సమంగా నిలిచినా.. మెరుగైన రన్‌రేట్‌తో మధ్యప్రదేశ్‌ రెండో బెర్త్‌ను దక్కించుకొంది. తొలుత హైదరాబాద్‌ 20 ఓవర్లలో 146/8 స్కోరు చేసింది. ప్రగ్నయ్‌ (43), అమన్‌ (33), తనయ్‌ (27) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. జగ్‌జీత్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో చండీగఢ్‌ 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసి గెలిచింది. అర్జున్‌ ఆజాద్‌ (63), శివం (42) రాణించారు. మిలింద్‌, రక్షణ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Jio Hotstar Exit: టీ20 ప్రపంచకప్ ముందు ఐసీసీకి షాక్.. జియో హాట్ స్టార్ సంచలన నిర్ణయం

87 ఏళ్ల రికార్డు.. జాబితాలో ఒకే ఒక్క భారత ప్లేయర్!

Updated Date - Dec 09 , 2025 | 05:44 AM