Vijay Hazare Trophy: హైదరాబాద్ పరాజయం
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:53 AM
విజయ్ హజారే ట్రోఫీని హైదరాబాద్ ఓటమితో ఆరంభించింది. గ్రూప్-బిలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 84 పరుగుల తేడాతో యూపీ చేతిలో ఓడింది....
రాజ్‌కోట్: విజయ్ హజారే ట్రోఫీని హైదరాబాద్ ఓటమితో ఆరంభించింది. గ్రూప్-బిలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 84 పరుగుల తేడాతో యూపీ చేతిలో ఓడింది. తొలుత యూపీ 50 ఓవర్లలో 324/5 స్కోరు చేసింది. అభిషేక్ గోస్వామి (81), ఆర్యన్ జుయాల్ (80), ధ్రువ్ జురెల్ (80) అర్ధ శతకాలు సాధించారు. ఛేదనలో హైదరాబాద్ 43 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. తన్మయ్ అగర్వాల్ (53), రాహుల్ బుద్ధి (47), వరుణ్ (45) కొంతమేర పోరాడారు. జీషన్ అన్సారీ నాలుగు వికెట్లు దక్కించుకొన్నాడు.
ఇవీ చదవండి:
మద్యం మత్తులో ఇంగ్లండ్ క్రికెటర్స్.. తొలిసారి స్పందించిన స్టోక్స్
బాదుడే బాదుడు.. 36 బంతుల్లోనే వైభవ్ సూపర్ సెంచరీ