Womens Chess World Cup: సిరీస్ కు హంపి
ABN , Publish Date - Jul 21 , 2025 | 03:34 AM
తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి.. ఫిడే మహిళల వరల్డ్‌కప్‌లో సంచలన ప్రదర్శన చేసింది. ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లి స్వర్ణానికి మరింత చేరువైంది...
మహిళల చెస్ వరల్డ్‌కప్
టైబ్రేక్‌కు హారిక, దేశ్‌ముఖ్ వైశాలి అవుట్
బటూమి (జార్జియా): తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి.. ఫిడే మహిళల వరల్డ్‌కప్‌లో సంచలన ప్రదర్శన చేసింది. ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లి స్వర్ణానికి మరింత చేరువైంది. చైనా క్రీడాకారిణి యుక్సిన్ సాంగ్‌తో క్వార్టర్‌ఫైనల్ పోరులో శనివారం తొలి గేమ్ గెలిచిన హంపి.. ఆదివారం జరిగిన రెండో గేమ్‌ను డ్రా చేసుకొంది. దీంతో హంపి 1.5-0.5 ఆధిక్యంతో యుక్సిన్‌పై గెలిచి తొలిసారి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకొంది. ఈ క్రమంలో.. ఫిడే మహిళల వరల్డ్ కప్‌లో సెమీస్ చేరిన తొలి భారత మహిళగా హంపి రికార్డు సృష్టించింది. కాగా, భారత్‌కు చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ వైశాలి టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాన్ జోంగి (చైనా)తో క్వార్టర్స్‌లో తొలి గేమ్‌ను డ్రాగా ముగించిన వైశాలి.. రెండో గేమ్‌లో ఓటమి పాలైంది. దీంతో వైశాలి 0.5-1.5తో టాంగ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి వెనుదిరిగింది. ఇక.. భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక, దివ్యా దేశ్‌ముఖ్ మధ్య క్వార్టర్స్ పోరులో రెండో గేమ్ కూడా డ్రాగా ముగిసింది. దీంతో ఇద్దరూ 1-1తో సమంగా నిలవడంతో.. ఫలితం కోసం టైబ్రేక్‌లో తలపడనున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి