Anushka Sharma to Leave Reveals: ఇక దయచేయండి
ABN , Publish Date - Sep 13 , 2025 | 02:37 AM
విరాట్ కోహ్లీ, అనుష్క జోడీని వెళ్లిపోవాలని న్యూజిలాండ్‌లోని ఓ హోటల్ సిబ్బంది కోరిన ఉదంతాన్ని టీమిండియా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ వెల్లడించింది. గతంలో భారత పురుషులు, మహిళల జట్లు ఒకే...
విరుష్కతో కివీస్ హోటల్ సిబ్బంది
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ, అనుష్క జోడీని వెళ్లిపోవాలని న్యూజిలాండ్‌లోని ఓ హోటల్ సిబ్బంది కోరిన ఉదంతాన్ని టీమిండియా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ వెల్లడించింది. గతంలో భారత పురుషులు, మహిళల జట్లు ఒకే సమయంలో కివీ్‌సలో పర్యటించాయి. ఇరు జట్లూ ఒకే హోటల్‌లో బస చేశాయి. ఈక్రమంలో బ్యాటింగ్‌కు సంబంధించి సలహాలు ఇవ్వాలని స్మృతి మంధాన, జెమీమా..విరాట్‌ను కోరారు. దాంతో అదే హోటల్‌లోని కేఫ్‌కు రావాలని విరాట్ వారికి సూచించాడు. అప్పటికే కోహ్లీ, అనుష్క జోడీ అక్కడ ఉంది. దాదాపు నాలుగు గంటలపాటు విరాట్, మంధాన, జెమీమాతోపాటు అనుష్క మాట్లాడుకున్నారట. తొలి అరగంట క్రికెట్ విషయాలపై చర్చించగా.. ఆపై సాధారణ జీవితానికి సంబంధించిన మాటల్లోకి జారుకున్నట్టు జెమీమా వెల్లడించింది. అప్పటికే రాత్రి 11.30 కావడంతో కేఫ్ సిబ్బంది వచ్చి విరాట్, అనుష్కను అక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించినట్టు రోడ్రిగ్స్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్
ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి