Sri Lanka vs Australia : శ్రీలంక 136/5
ABN , Publish Date - Feb 01 , 2025 | 04:00 AM
శ్రీలంక-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టును భారీ వర్షం ఆటంకపరిచింది. దీంతో శుక్రవారం మూడో రోజు 27 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఉదయం 11.45 గంటల నుంచే వర్షం
గాలె: శ్రీలంక-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టును భారీ వర్షం ఆటంకపరిచింది. దీంతో శుక్రవారం మూడో రోజు 27 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఉదయం 11.45 గంటల నుంచే వర్షం కురవడంతో కాస్త ముందుగానే లంచ్‌కు వెళ్లారు. ఆ సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. చాందిమల్ (63 బ్యాటింగ్), కుశాల్ మెండిస్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఎంతసేపటికీ వర్షం తెరిపినివ్వకపోవడంతో మధ్యాహ్నం 3.35 గంటలకు ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను 654/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి:
ఒకే ఓవర్‌లో 3 వికెట్లు.. భారత్ పుట్టి ముంచిన కుర్ర పేసర్
టీమిండియాకు బ్యాడ్ లక్.. టాస్‌లో ఇలా జరిగిందేంటి
కాళ్లు మొక్కిన కోహ్లీ.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి