బ్యాటింగ్‌కు రాకుండా నిద్రపోయాడు!
ABN , Publish Date - Mar 07 , 2025 | 06:22 AM
పాకిస్థాన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ప్రెసిడెంట్ కప్ గ్రేడ్-1 టోర్నీ ఫైనల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్‌కు ఆడుతున్న సౌద్ షకీల్ మ్యాచ్...

సౌద్ షకీల్ టైమ్డ్ అవుట్
రావల్పిండి: పాకిస్థాన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ప్రెసిడెంట్ కప్ గ్రేడ్-1 టోర్నీ ఫైనల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్‌కు ఆడుతున్న సౌద్ షకీల్ మ్యాచ్ సమయంలో నిద్రపోయి టైమ్డ్ అవుట్ అయ్యాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ బ్యాటర్ అవుటయ్యాక మరో బ్యాటర్ మూడు నిమిషాల్లోపు క్రీజులోకి రావాల్సి ఉంటుంది. లేనిపక్షంలో అతడిని ‘టైమ్డ్ అవుట్’గా ప్రకటిస్తారు. మంగళవారం పాక్ టెలివిజన్ టీమ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లోని 27వ ఓవర్ 3, 4 బంతులకు ఆటగాళ్లు వరుసగా అవుటయ్యారు. ఆలస్యంగా వచ్చిన షకీల్‌పై ప్రత్యర్థి కెప్టెన్ ఫిర్యాదు చేయడంతో అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్ కూడా ఐదో బంతికి వెనుదిరగడంతో షకీల్‌తో కలిపి ఆ ఓవర్లో మొత్తం నలుగురు అవుటైనట్టయ్యింది. ఇక టైమ్డ్ అవుటైన తొలి పాక్ క్రికెటర్‌గా షకీల్ నిలిచాడు.
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి