Asia Cup Hockey 2025: హర్మన్‌ప్రీత్ సారథ్యంలో
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:00 AM
ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌కు భారత జట్టును బుధవారం ప్రకటించారు. ఈనెల 29 నుంచి వచ్చేనెల 7 వరకు బిహార్‌లోని రాజ్‌గిర్‌లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఇందులో పాల్గొనే 18 మందితో...
ఆసియా కప్‌నకు భారత హాకీ జట్టు
న్యూఢిల్లీ: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌కు భారత జట్టును బుధవారం ప్రకటించారు. ఈనెల 29 నుంచి వచ్చేనెల 7 వరకు బిహార్‌లోని రాజ్‌గిర్‌లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఇందులో పాల్గొనే 18 మందితో కూడిన భారత జట్టును రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ముందుండి నడిపించనున్నాడు. కాగా, జట్టులో పెద్దగా మార్పులు లేవు. కాకపోతే ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన మిడ్‌ఫీల్డర్ రాజిందర్ సింగ్, ఫార్వర్డ్ ఆటగాళ్లు శిలానంద్ లక్రా, దిల్‌ప్రీత్ సింగ్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఇక.. ఆసియా కప్‌లో విజేతగా నిలిచిన జట్టుకు వచ్చే ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్, బెల్జియం వేదికలుగా జరిగే ప్రపంచ క్‌పనకు నేరుగా బెర్త్ దక్కనుంది.
ఇవి కూడా చదవండి..
Asian Shooting Championship: రష్మికకు స్వర్ణం మనుకు కాంస్యం
India Women Cricket: ప్రపంచకప్ జట్టులో శ్రీచరణి
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..