Share News

Harmanpreet Kaur Stresses: అలా ఆడడం మాకు కీలకం

ABN , Publish Date - Sep 27 , 2025 | 05:25 AM

వన్డే వరల్డ్‌ కప్‌లో తమపై భారీగా అంచనాలుంటాయని భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఒత్తిడికి లోనుకాకుండా....

Harmanpreet Kaur Stresses: అలా ఆడడం మాకు కీలకం

3 రోజుల్లో మహిళల ప్రపంచ కప్‌

భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌

బెంగళూరు: వన్డే వరల్డ్‌ కప్‌లో తమపై భారీగా అంచనాలుంటాయని భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఒత్తిడికి లోనుకాకుండా ఉండడమే టోర్నీలో ముఖ్యమని పేర్కొంది. ప్రతిష్ఠాత్మక మహిళల వన్డే ప్రపంచ కప్‌ ఈనెల 30న భారత్‌, శ్రీలంక వేదికలుగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఎనిమిది జట్ల కెప్టెన్లు శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్మన్‌ మాట్లాడుతూ.. ‘12 ఏళ్ల తర్వాత స్వదేశంలో మెగా టోర్నమెంట్‌ జరగడం అద్భుతంగా ఉంది. సొంత గడ్డపై జరుగుతుండడంతో జట్టుపై సహజంగానే ఫ్యాన్స్‌ అంచనాలు భారీగా ఉంటాయి. అయితే ఒత్తిడికి గురికాకుండా మ్యాచ్‌లో ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తూ ఆడడం చాలా కీలకం’ అని హర్మన్‌ వివరించింది. 30న గువాహటిలో జరిగే టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్‌ తలపడనుంది. అక్టోబరు 5న కొలంబోలో పాకిస్థాన్‌ను టీమిండియా ఢీకొననుంది. ఆ మ్యాచ్‌పై హర్మన్‌ మాట్లాడుతూ..పాకిస్థాన్‌తో పోరుపై దృష్టి సారిస్తామే తప్ప..ఆ మ్యాచ్‌ చుట్టూ జరిగే రాజకీయ అంశాలతో తమకు సంబంధంలేదని స్పష్టంజేసింది. ఇక, భారత్‌ను వారి గడ్డపై ఓడించడం కష్టమని ఆస్ట్రేలియా సారథి అలీసా హీలీ చెప్పింది. కాగా, భయంలేని క్రికెట్‌ ఆడతామని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ సోఫీ డిఫైన్‌ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి..

ఫీవర్‌తో బాధపడుతున్న పవన్

మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం

Read latest AP News And Telugu News

Updated Date - Sep 27 , 2025 | 05:25 AM