Chennai Chess: హారికకు తొలి గెలుపు
ABN , Publish Date - Aug 13 , 2025 | 02:01 AM
చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్‌లో ద్రోణవల్లి హారిక తొలి గెలుపును నమోదు చేయగా.. అర్జున్ ఇరిగేసికి మరో డ్రా ఎదురైంది. మంగళవారం జరిగిన ఓపెన్ ఆరో రౌండ్‌లో విన్సెంట్ కీమర్ (జర్మనీ)తో అర్జున్ పాయింట్...
‘చెన్నై’ చెస్‌లో అర్జున్‌కు డ్రా
చెన్నై: చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్‌లో ద్రోణవల్లి హారిక తొలి గెలుపును నమోదు చేయగా.. అర్జున్ ఇరిగేసికి మరో డ్రా ఎదురైంది. మంగళవారం జరిగిన ఓపెన్ ఆరో రౌండ్‌లో విన్సెంట్ కీమర్ (జర్మనీ)తో అర్జున్ పాయింట్ పంచుకొన్నాడు. నిహాల్ సరీన్, ప్రణవ్ పరాజయం పాలయ్యారు. ఆరు రౌండ్లు ముగిసే సరికి అర్జున్ 3.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. చాలెంజర్స్ విభాగంలో సహచర జీఎం వైశాలిపై హారిక నెగ్గింది. ఆరు రౌండ్లలో హారికకు ఇదే మొదటి విజయం కావడం విశేషం.
ఇవి కూడా చదవండి
ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి