Hardik Pandya: నా హీరో
ABN , Publish Date - Dec 11 , 2025 | 06:05 AM
ఆసియా కప్ సందర్భంగా గాయపడి సుదీర్ఘ కాలం ఆటకు దూరంగా ఉండి జట్టులోకి పునరాగమనం చేసిన హార్దిక్ పాండ్యా దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో అదరగొట్టాడు....
హార్దిక్‌పై గర్ల్‌ఫ్రెండ్ ప్రశంసలు
ముంబై: ఆసియా కప్ సందర్భంగా గాయపడి సుదీర్ఘ కాలం ఆటకు దూరంగా ఉండి జట్టులోకి పునరాగమనం చేసిన హార్దిక్ పాండ్యా దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో అదరగొట్టాడు. టీమిండియా 101 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన మ్యాచ్‌లో హార్దిక్ బ్యాటుతో, బంతితో కీలక భూమిక పోషించాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ గర్ల్‌ఫ్రెండ్, మోడల్ మహిక శర్మ అతడి ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురిపించింది. ‘అతడు కింగ్. నా హీరో. ఎవరు తిరిగొచ్చారో ఊహించండి’ అని ఇన్‌స్టాలో ఆమె పోస్ట్ చేసింది.
ఇవీ చదవండి:
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. నెం.2గా కోహ్లీ
నా ఇన్‌స్టాలో బుమ్రా కనిపించాలంటే..!.. అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యలు వైరల్