Share News

National Shooting Championship: షూటర్‌ ముఖేష్‌కు స్వర్ణం

ABN , Publish Date - May 03 , 2025 | 04:31 AM

జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో గుంటూరు షూటర్‌ నేలవల్లి ముఖేష్‌ 25మీ. స్పోర్ట్స్‌ పిస్టల్‌ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. భోపాల్‌లో జరిగిన ఈ పోటీలో అతడు 586 పాయింట్లు సాధించి తొలి స్థానంలో నిలిచాడు.

National Shooting Championship: షూటర్‌ ముఖేష్‌కు స్వర్ణం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షి్‌పలో గుంటూరు యువ షూటర్‌ నేలవల్లి ముఖేష్‌ పసిడి పతకం కొల్లగొట్టాడు. శుక్రవారం భోపాల్‌లో జరిగిన ఈ పోటీల్లోని 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌ విభాగంలో ముఖేష్‌ 600కు గానూ 586 పాయింట్లు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. సమీర్‌ (హరియాణా) రజతం, సాహిల్‌ చౌధురి (మధ్యప్రదేశ్‌) కాంస్య పతకాలు దక్కించుకున్నారు.

Updated Date - May 03 , 2025 | 04:33 AM