నాకౌట్‌కు గుకేష్
ABN , Publish Date - Feb 09 , 2025 | 04:30 AM
వరల్డ్ చాంపియన్ గుకేష్ ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ టూర్ చెస్ టోర్నీ నాకౌట్‌కు చేరాడు. అయితే శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్ చివరి, తొమ్మిదో గేమ్‌లో ప్రపంచ నెంబర్‌వన్ ఆటగాడు...
ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్‌స్లామ్ టూర్
వీసెన్‌హా్‌స (జర్మనీ): వరల్డ్ చాంపియన్ గుకేష్ ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ టూర్ చెస్ టోర్నీ నాకౌట్‌కు చేరాడు. అయితే శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్ చివరి, తొమ్మిదో గేమ్‌లో ప్రపంచ నెంబర్‌వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ చేతిలో భారత గ్రాండ్‌మాస్టర్ ఓడిపోయాడు. హోరాహోరీ పోరులో నల్లపావులతో ఆడిన మాగ్నస్ 46 ఎత్తుల్లో గుకే్‌షపై గెలుపొందాడు. ఇక తొమ్మిది రౌండ్లలో..రెండింటిలో ఓడిన గుకేష్ ఏడు గేమ్‌లు డ్రా చేశాడు. క్వాలిఫయింగ్ తొమ్మిది గేమ్‌ల ద్వారా మొత్తం 3.5 పాయింట్లు సాధించిన గుకేష్ నాకౌట్‌కు క్వాలిఫై అయ్యాడు. రౌండ్ రాబిన్‌లో తలపడిన మొత్తం 10 మంది ఆటగాళ్లలో గుకేష్, కార్ల్‌సన్ సహా ఎనిమిదిమంది నాకౌట్‌కు అర్హత సాధించారు.
ఇవీ చదవండి:
క్రికెట్‌లో కొత్త ఫార్మాట్.. 90 బంతుల్లో ఖేల్ ఖతం.. టీ20లను మించేలా..
ఫైనల్ చేరిన సన్‌రైజర్స్.. కావ్యా పాప టీమ్ అంటే మినిమం ఉండాలి
‘సన్‌రైజర్స్’బ్యాడ్మింటన్‌లో కొత్త స్కోరింగ్ విధానం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి