‘అమ్మాయిల ఫుట్‌బాల్.. సంప్రదాయాలకు వ్యతిరేకం’
ABN , Publish Date - Jan 31 , 2025 | 03:07 AM
బంగ్లాదేశ్‌లో మత ఛాందస వాదులు పేట్రేగిపోతున్నారు. సంప్రదాయాల మాటున అఫ్ఘానిస్థాన్ తరహాలో మహిళల హక్కులను హరించే కుట్రలు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా బంగ్లాదేశ్‌లో...

మ్యాచ్‌ను నిలిపేసిన ఛాందసులు
ఢాకా: బంగ్లాదేశ్‌లో మత ఛాందస వాదులు పేట్రేగిపోతున్నారు. సంప్రదాయాల మాటున అఫ్ఘానిస్థాన్ తరహాలో మహిళల హక్కులను హరించే కుట్రలు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా బంగ్లాదేశ్‌లో మహిళలు ఫుట్‌బాల్ ఆడుతున్నారు. అయితే, తాజాగా అంతర్ జిల్లా జట్ల మధ్య జరుగుతున్న అమ్మాయిల మ్యాచ్‌ను ఛాందసవాదులు అడ్డుకొన్నారు. మహిళలు ఫుట్‌బాల్ ఆడడం ఇస్లాంకు వ్యతిరేమని వాదిస్తున్నారు. వందల మంది గుంపులుగా మైదానంలోకి వచ్చి నిరసన తెలియజేశారని నిర్వాహకులు తెలిపారు. పరిస్థితులు హింసాత్మకంగా మారే ప్రమాదం ఉండడంతో మ్యాచ్‌ను నిలిపివేసినట్టు చెప్పారు. అయితే, ఈ చర్యలను బంగ్లాదేశ్ ఫుట్‌బాల్ సమాఖ్య (బీఎ్‌ఫఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఇలా అమ్మాయిల మ్యాచ్‌ను అడ్డుకోవడం ఇది వరుసగా రెండోసారి.
ఇదీ చదవండి:
నాలుగో టీ20.. టీమిండియాకు సూపర్ న్యూస్.. మహాబలుడు వచ్చేస్తున్నాడు
కోహ్లీని భయపెట్టిన ఉపేంద్ర.. సొంతగడ్డపై అంతా చూస్తుండగానే..
ఎప్పుడూ చూడని రనౌట్.. ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి