Share News

Lords Test 2025: లార్డ్స్‌ ఓటమికి గిల్‌ తీరే కారణం

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:21 AM

లార్డ్స్‌ టెస్ట్‌లో భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ వ్యవహార శైలిని మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌ తీవ్రంగా తప్పుబట్టాడు. మూడో రోజు ఆట చివర్లో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాగా..

Lords Test 2025: లార్డ్స్‌ ఓటమికి గిల్‌ తీరే కారణం

న్యూఢిల్లీ: లార్డ్స్‌ టెస్ట్‌లో భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ వ్యవహార శైలిని మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌ తీవ్రంగా తప్పుబట్టాడు. మూడో రోజు ఆట చివర్లో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాగా.. సమయం వృథా చేస్తున్నావంటూ ఓపెనర్‌ క్రాలేతో గిల్‌ గొడవకు దిగడం ఆ జట్టును రెచ్చగొట్టిందన్నాడు. అది మనసులో పెట్టుకొని స్టోక్స్‌ కసిగా బౌలింగ్‌ చేసి టీమిండియాను దెబ్బతీశాడని కైఫ్‌ విశ్లేషించాడు. తన తత్వానికి తగిన విధంగా గిల్‌ నడుచుకోవాలని హితవు పలికాడు. కాగా, కోహ్లీని గిల్‌ అనుకరించే ప్రయత్నం చేస్తున్నాడని మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్‌ విమర్శించాడు. అందరి దృష్టిని ఆకర్షించడం కోసమే ఇలా చేస్తున్నాడన్నాడు.

ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 17 , 2025 | 04:21 AM