Ashwin Comments: సంజూ స్థానానికి ఎసరు
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:04 AM
కెప్టెన్‌గా తొలి సిరీ్‌సలోనే ఇంగ్లండ్‌పై భారత జట్టును శుభ్‌మన్ గిల్ అద్భుతంగా నడిపించాడు. నాయకత్వ బాధ్యతలను సమర్థంగా నిర్వహించడంతోపాటు బ్యాటర్‌గానూ అదరగొట్టాడు. ఈనేపథ్యంలో..ఏడాదిగా ‘పొట్టి’ జట్టుకు దూరంగా ఉన్న...
న్యూఢిల్లీ: కెప్టెన్‌గా తొలి సిరీ్‌సలోనే ఇంగ్లండ్‌పై భారత జట్టును శుభ్‌మన్ గిల్ అద్భుతంగా నడిపించాడు. నాయకత్వ బాధ్యతలను సమర్థంగా నిర్వహించడంతోపాటు బ్యాటర్‌గానూ అదరగొట్టాడు. ఈనేపథ్యంలో..ఏడాదిగా ‘పొట్టి’ జట్టుకు దూరంగా ఉన్న గిల్‌ను ఆసియా కప్ టీ20 టోర్నీకి టీమిండియాలో చోటు కల్పించడమేకాదు..వై్‌స-కెప్టెన్‌గానూ నియమించారు. మరోవైపు ఆసియా కప్‌నకు సంజూ శాంసన్ జట్టులో చోటు లభించింది. కానీ గిల్‌ను వైస్-కెప్టెన్ చేయడంతో తుది జట్టులో సంజూకు స్థానంపై చర్చ మొదలైంది. ఆసియా కప్‌లో భాగంగా ఒమన్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో అభిషేక్ శర్మతో కలిసి గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత బ్యాటింగ్ ఆర్డర్‌లో తిలక్ వర్మ, సూర్యకుమార్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వస్తారు. ఈ క్రమంలో చూస్తే టాపార్డర్‌లో సంజూకు చోటెక్కడనే ప్రశ్న తలెత్తుతోంది. కాగా..టీ20 జట్టుకు గిల్‌ను ఎంపిక చేయడంపై మాజీ స్పిన్నర్ అశ్విన్ విమర్శల బాణాలు ఎక్కుపెట్టాడు. ‘భవిష్యత్‌లో అన్ని ఫార్మాట్లకు గిల్‌ను కెప్టెన్‌గా జట్టు యాజమాన్యం భావిస్తుండొచ్చు. కానీ ఒకడే అన్ని ఫార్మాట్లకు సారథిగా ఉండనవసరంలేదు’ అని వ్యాఖ్యానించాడు. ‘గిల్‌ను వైస్-కెప్టెన్‌గా ప్రకటించడం విచారకరం. అతడు ఓపెనర్‌గా వస్తాడు. అందువల్ల సంజూ స్థానానికి ముప్పు ఏర్పడినట్టే’ అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ ఫామ్ ప్రామాణికమైతే..
టీ20 జట్టులో చోటుకు ఐపీఎల్ ప్రదర్శనే ప్రామాణికమని కోచ్ గంభీర్ గతంలో స్పష్టంజేశాడు. ఆ కోణంలో చూస్తే ఆసియా కప్‌నకు ఆ ఆటగాళ్లు ఎందుకు ఎంపిక కాలేదనే చర్చ నడుస్తోంది. శ్రేయాస్ అయ్యర్, సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్, ప్రసిద్ధ్ కృష్ణ ఈసారి ఐపీఎల్‌లో ఎలా రాణించారో చూశాం. వీరెవరూ తాజా ఆసియా కప్ జట్టులో లేరు. ఇక ప్రసిద్ధ్ కృష్ణను కంటితుడుపుగా స్టాండ్‌బైగా ఎంపిక చేశారు.
ఇవి కూడా చదవండి..
Asian Shooting Championship: రష్మికకు స్వర్ణం మనుకు కాంస్యం
India Women Cricket: ప్రపంచకప్ జట్టులో శ్రీచరణి
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..