బి-జట్టుపై కూడా నెగ్గలేరు!
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:04 AM
చాంపియన్స్ ట్రోఫీ రేసు నుంచి నాకౌటైన పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్‌పై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సెటైర్లు వేశాడు...

పాక్ ఆటతీరుపై గవాస్కర్
న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీ రేసు నుంచి నాకౌటైన పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్‌పై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సెటైర్లు వేశాడు. భారత ద్వితీయ శ్రేణి జట్టును ఓడించడం కూడా పాక్ వల్లకాదన్నాడు. ‘నాకు తెలిసి ప్రస్తుత ఫామ్‌తో భారత్-బి జట్టుపై గెలవడం కూడా పాక్‌కు కష్టమే. సి-టీమ్ విషయం చెప్పలేను. పాక్ రిజర్వు బెంచ్ బలంగా లేకపోవడం ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది’ అన్నా డు. కాగా కెప్టెన్‌గా ధోనీని నియమించినా.. పాక్ తలరాతను మార్చలేడని ఆ దేశ మహిళా జట్టు మాజీ కెప్టెన్ సనా మిర్ విమర్శించింది. ‘ధోనీ లేదా యూనిస్ ఖాన్‌ను సారథులుగా నియమించినా.. ఈ జట్టుతో ఏమీ చేయలేరు. టోర్నీ కోసం 15 మంది జట్టు సభ్యులను ప్రకటించినప్పుడే ఆశలు వదిలేసుకొన్నా’నని చెప్పింది.
ఇవీ చదవండి:
టాస్ పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీస్‌పై సస్పెన్స్ కంటిన్యూ
భార్య గురించి షాకింగ్ విషయం చెప్పిన చాహల్..
భారత్ విజయంపై పాక్ వక్రభాష్యం.. విజయానికి కారణం అదేనట..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి