Share News

Gautam Gambhir: గంభీర్ కళ్లలో నీళ్లు.. మ్యాచ్ అనంతరం గంభీర్ ఎంత ఎమోషనల్ అయ్యాడో చూడండి..

ABN , Publish Date - Aug 05 , 2025 | 11:10 AM

టీమిండియా పేలవ ప్రదర్శన కారణంగా గంభీర్ పలు విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ మొదలైంది. కుర్రాళ్లతో కూడా టీమిండియా ఇంగ్లండ్‌లో పెద్దగా సాధించేది ఏమీ ఉండదని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే తొలి టెస్ట్‌లో టీమిండియా పరాజయం పాలైంది.

Gautam Gambhir: గంభీర్ కళ్లలో నీళ్లు.. మ్యాచ్ అనంతరం గంభీర్ ఎంత ఎమోషనల్ అయ్యాడో చూడండి..
Gautam Gambhir emotional

టీమిండియా టీ-20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరించాడు. అప్పటికే ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియాను గంభీర్ మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తాడని అందరూ భావించారు. అతడు కోరినవన్నీ ఇవ్వడానికి బీసీసీఐ (BCCI) అంగీకరించింది. అయితే ఆ తర్వాత టీమిండియా ఆటతీరు తీవ్ర విమర్శలపాలైంది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఓటమిపాలైంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైంది. శ్రీలంకతో వన్డే సిరీస్ కోల్పోయింది.


టీమిండియా పేలవ ప్రదర్శన కారణంగా గంభీర్ పలు విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ మొదలైంది (Ind vs Eng). కుర్రాళ్లతో కూడిన టీమిండియా.. ఇంగ్లండ్‌లో పెద్దగా సాధించేది ఏమీ ఉండదని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే తొలి టెస్ట్‌లో టీమిండియా పరాజయం పాలైంది. అయితే రెండో టెస్ట్ మ్యాచ్‌లో అనూహ్యంగా పుంజుకుని భారీ విజయం సాధించింది. ఇక, మూడో టెస్ట్‌లో చివరి వరకు పోరాడి 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఓటమి తప్పదనుకున్న నాలుగో టెస్ట్‌ను డ్రా చేసుకుంది. ఇక, ఐదో టెస్ట్ కూడా చేజారినట్టే అనుకున్న తరుణంలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.


ఓవల్‌లో ఐదో టెస్ట్ మ్యాచ్ విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చిన్న పిల్లాడిలా సంబరాలు చేసుకున్నాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. సహచరులను హత్తుకుని ఎమోషనల్ అయ్యాడు. నిజానికి గంభీర్ ఎలాంటి భావోద్వేగాలనూ ప్రదర్శించాడు. అయితే ఈ సిరీస్ ఓడిపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో గంభీర్ ఎమోషనల్ అయ్యాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి..

గిల్ మాస్టర్‌ప్లాన్.. చివరి ఓవర్లో క్రాలీని సిరాజ్ ఎలా బౌల్డ్ చేశాడో చూడండి..

ఇది క్రీడా పోటీనా..భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 05 , 2025 | 12:34 PM