Share News

Ganguly Cricket Statement: ఫామ్‌లో ఉంటే ఆడించాలి

ABN , Publish Date - Aug 11 , 2025 | 05:53 AM

టెస్టు, టీ20 ఫార్మాట్ల నుంచి వైదొలిగి కేవలం వన్డేలకే పరిమితమైన విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మల కెరీర్‌పై ఊహాగానాలు వెలువడుతున్నాయి. అక్టోబరులో ఆసీస్‌ టూర్‌ తర్వాత ఈ జోడీ పూర్తిగా క్రికెట్‌కు దూరమవుతారని...

Ganguly Cricket Statement: ఫామ్‌లో ఉంటే ఆడించాలి

విరాట్‌, రోహిత్‌లపై గంగూలీ

న్యూఢిల్లీ: టెస్టు, టీ20 ఫార్మాట్ల నుంచి వైదొలిగి కేవలం వన్డేలకే పరిమితమైన విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మల కెరీర్‌పై ఊహాగానాలు వెలువడుతున్నాయి. అక్టోబరులో ఆసీస్‌ టూర్‌ తర్వాత ఈ జోడీ పూర్తిగా క్రికెట్‌కు దూరమవుతారని అంటున్నారు. ఈనేపథ్యంలో మాజీ కెప్టెన్‌ గంగూలీ వారికి మద్దతుగా నిలిచాడు. ‘వారి రిటైర్మెంట్‌ వార్తలపై నేనేమీ స్పందించను. ఎప్పుడు వైదొలుగుతారనేది చెప్పడం కష్టం. కానీ ఫామ్‌లో ఉన్నంతకాలం కొనసాగించడమే మంచిది. వన్డే ఫార్మాట్‌లో విరాట్‌, రోహిత్‌ల రికార్డు అద్భుతంగా ఉంది’ అని దాదా గుర్తుచేశాడు. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు, ఇటీవలి ఇంగ్లండ్‌ పర్యటనకు ముందే టెస్టు ఫార్మాట్‌కు ఈ స్టార్‌ బ్యాటర్లు వీడ్కోలు పలికారు.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

For More Telangana News And Telugu News

Updated Date - Aug 11 , 2025 | 05:53 AM