Gambhir Emphasizes: బలమైన సంస్కృతిని పెంపొందించాలి
ABN , Publish Date - Aug 06 , 2025 | 02:06 AM
నిరంతర కృషి, పురోగతితో బలమైన జట్టు సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరం ఉందని గంభీర్ సూచించాడు.
లండన్: నిరంతర కృషి, పురోగతితో బలమైన జట్టు సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరం ఉందని గంభీర్ సూచించాడు. ‘జట్టులోకి ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు. డ్రెస్సింగ్ రూమ్ సంస్కృతే అందరినీ ఆకర్షిస్తుంద’ని ఐదో టెస్ట్ ముగిసిన అనంతరం ఆటగాళ్లతో గౌతీ అన్నాడు. 2-2తో సిరీస్ సమం చేయడం అద్భుతమని కొనియాడాడు. మన నైపుణ్యాలను సానబెట్టుకొంటూ సాగితే.. సుదీర్ఘకాలం ఆధిపత్యం ప్రదర్శించవచ్చన్నాడు. ఈ సందర్భంగా ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అవార్డును సుందర్‌కు జడేజా అందజేశాడు.