Share News

Hockey Junior World Cup: హాకీ వరల్డ్‌క్‌పనకు టిక్కెట్లు ఫ్రీ

ABN , Publish Date - Nov 24 , 2025 | 06:02 AM

పురుషుల హాకీ జూనియర్‌ వరల్డ్‌కప్‌ పోటీలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే అభిమానులకు భారత హాకీ సమాఖ్య బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. చెన్నై వేదికగా...

Hockey Junior World Cup: హాకీ వరల్డ్‌క్‌పనకు టిక్కెట్లు ఫ్రీ

మధురై: పురుషుల హాకీ జూనియర్‌ వరల్డ్‌కప్‌ పోటీలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే అభిమానులకు భారత హాకీ సమాఖ్య బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. చెన్నై వేదికగా ఈనెల 28 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు జరగనున్న ఈ మ్యాచ్‌లకి అభిమానులకు ఉచితంగా టిక్కెట్లు ఇవ్వనున్నట్టు హాకీ సమాఖ్య తెలిపింది. ఈ వరల్డ్‌క్‌పలో మొత్తం 24 దేశాలు పాల్గొంటున్నాయి. టిక్కెట్‌ జీనీ వెబ్‌సైట్‌లో అభిమానులు ఫ్రీ టిక్కెట్లను పొందవచ్చు. యువ క్రీడాకారులు, విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా మ్యాచ్‌లు చూడడానికి రావచ్చునని హాకీ సమాఖ్య తెలిపింది.

ఇవీ చదవండి:

అంధ మహిళల టీ20 ప్రపంచకప్ భారత్‌దే.. జట్టుపై అభినందనలు..

ఊహించని పరిణామం.. స్మృతి మంధాన పెళ్లి వాయిదా..

Updated Date - Nov 24 , 2025 | 06:02 AM