Share News

Ind Vs Pak: ఓటమి జీర్ణించుకోలేక.. భారత్ ఫ్యాన్స్‌గా మారిపోయిన పాక్ అభిమానులు

ABN , Publish Date - Feb 24 , 2025 | 10:54 AM

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ జీర్ణించుకోలేని దయాది దేశం అభిమానులు కొందరు భారత్‌కు జై కొట్టారు. నైపుణ్యాల్లో పాక్ కంటే భారత్ ఎన్నో రెట్లు మెరగంటూ టీమిండియాకు మద్దతుగా నిలుస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Ind Vs Pak: ఓటమి జీర్ణించుకోలేక.. భారత్ ఫ్యాన్స్‌గా మారిపోయిన పాక్ అభిమానులు

ఇంటర్నెట్ డెస్క్: భారత ఉపఖండంలో క్రికెట్ అంటే ఓ భావోద్వేగం. సొంత టీమ్‌లు ఓడిపోతే అభిమానులు జీర్ణించుకోలేరు. ఒకప్పుడు పాక్ ఓటమిని తట్టుకోలేని పాక్ అభిమానులు టీవీలు పగలగొడుతుండే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓటమిని తట్టుకోలేక అనేక మంది చివరకు టీమిండియా ఫ్యాన్స్‌గా మారిపోయారు (Champions Trophy 2025 Ind Vs Pak).

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగిన భారత్ పాక్ మ్యాచ్.. దాయాది దేశ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసిన విషయం తెలిసిందే. అనేక మంది సొంత టీమ్‌ను సోషల్ మీడియాలో, టీవీల్లో తిట్టిపోశారు. పాక్ తీరుకు తీవ్ర నిరాశకు లోనైన అనేక మంది మరో ఆలోచన లేకుండా టీమిండియాకు జైకొట్టారు. భారత స్టార్ బ్యాటర్లు బౌండరీలు బాదుతుంటే చూస్తూ కేరింతలు కొట్టారు.


Virat Kohli: సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ.. అత్యంత వేగంగా 14 వేల పరుగులు

ఆ తరువాత విలేకరులో మాట్లాడుతూ పాక్ అభిమానులు తమ అక్కసును వెళ్ళగక్కారు. ‘‘వాళ్లకు కనీస నైపుణ్యాలు, ఫిట్‌నెస్, శ్రమ కూడా కరువయ్యాయి. అందుకే మేము నేటి మ్యాచ్‌లో భారత్‌కు మద్దతు పలికాము’’ అని ఓ వ్యక్తి నిర్మోహమాటంగా తేల్చి చెప్పాడు. ఇక విరాట్ కోహ్లీ విజృంభించడం కూడా తమకు ఆశ్చర్యమేమీ కలిగించలేదని అన్నారు. ‘‘గత ఏడాదిగా ఫామ్ లేమితో విరాట్ సతమతమవుతున్నాడు. అయినా పాక్‌తో మ్యాచ్‌లో అతడు విజృంభిస్తాడని మాకు తెలుసు’’ అని కామెంట్ చేశాడు.


Ind vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. దుబాయ్‌లో నారా లోకేష్, సుకుమార్.. !

మరికొందరేమో నేరుగా పాక్‌పై విమర్శలు గుప్పించారు. పాక్ మరింతగా ట్రెయినింగ్ తీసుకోవాలని కొందరు అన్నారు. ఫీల్డింగ్‌లో వారి నైపుణ్యం తీసికట్టుగా ఉందని అన్నారు. ప్రజల సెంటీమెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, కాస్తంతైన బాధ్యత తీసుకోవాలని కామెంట్ చేశారు. ‘‘పాక్ టీం నైపుణ్యాలను పెంచుకునే ప్రయత్నం చేయాలి. మేమేమో టీమ్ గెలుపు కోసం ప్రార్థి్స్తుంటాము. కానీ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడంపై మాత్రం శ్రద్ధ పెట్టట్లేదు’’ అని మరో వ్యక్తి అన్నాడు. తమ టీం కనీసం 315 అన్నా స్కోర్ చేస్తుందని భావించామని, కానీ 250కే ఆల్‌ఔట్ కావడం తీవ్ర నిరాశపరిచిందని అన్నారు. ‘‘ఓడిపోయాం సరే.. కనీసం విరాట్ సెంచరీ చేయకుండా అయినా అడ్డుకుని ఉండాల్సింది కదా. బ్యాటింగ్ సరిగా లేనప్పుడు బౌలింగ్‌లో అయినా సత్తా చాటి ఉండాల్సింది. పాక్ టీం భవిష్యత్తు కోసం కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నా’’ అని ఓ పాక్ అభిమాని అన్నారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 24 , 2025 | 10:54 AM