Fans Flock for Hardik Pandya: పాండ్యా కోసం పోటెత్తిన అభిమానం
ABN , Publish Date - Dec 05 , 2025 | 06:24 AM
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరఫున ఆడుతున్న టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కోసం అభిమానులు పోటెత్తడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్ వేదికను తరలించాల్సి వచ్చింది...
మ్యాచ్ వేదిక ఉప్పల్‌కు తరలింపు
హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరఫున ఆడుతున్న టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కోసం అభిమానులు పోటెత్తడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్ వేదికను తరలించాల్సి వచ్చింది. గురువారం జింఖానా మైదానంలో బరోడా, గుజరాత్ మ్యాచ్‌ను షెడ్యూల్ చేశారు. కానీ, జట్టు బసచేసిన హోటల్ బయట, నెట్ ప్రాక్టీస్ సమయంలో, టికెట్ కౌంటర్ల వద్ద ఫ్యాన్స్ భారీగా గుమిగూడడాన్ని నిర్వాహకులు గమనించారు. దీంతో ముందు జాగ్రత్తగా మ్యాచ్ వేదికను జింఖానా నుంచి ఉప్పల్‌కు మార్చారు. మ్యాచ్ సాఫీగా కొనసాగించడంతోపాటు ఆటగాళ్ల, అభిమానుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్టు నిర్వాహకులు తెలిపారు. కాగా, ఈ మ్యాచ్‌లో బరోడా 8 వికెట్ల తేడాతో గుజరాత్‌పై ఘన విజయం సాధించింది. పాండ్యా 10 పరుగులు చేయడంతోపాటు ఒక వికెట్ పడగొట్టాడు.
ఈ వార్తలు కూడా చదవండి
'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!
పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత
Read Latest AP News And Telugu News