English Heading: మ్యాచ్ బహిష్కరణ డిమాండ్‌కు పంజాబ్ కింగ్స్ వినూత్న ట్విస్ట్
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:13 AM
పహల్గావ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ సంబంధాలు మరింత దెబ్బ తిన్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌ను టీమిండియా బహిష్కరించాలనే...
న్యూఢిల్లీ: పహల్గావ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ సంబంధాలు మరింత దెబ్బ తిన్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌ను టీమిండియా బహిష్కరించాలనే డిమాండ్ భారత్‌లో పెద్దఎత్తున వినిపిస్తోంది. చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఆ మ్యాచ్‌ను తాము తిలకించబోమని సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా వారి బాటలో నడిచారు. తామూ ఇండో-పాక్ పోరును చూడబోమని స్పష్టంజేశారు. ఈక్రమంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ ‘మ్యాచ్ బాయ్‌కాట్’ను వినూత్నంగా ప్రదర్శించింది. కెప్టెన్ సూర్యకుమార్ ఫొటోతో ‘డిఫెండింగ్ చాంపియన్ ఇండియా మ్యాచ్ అంటూ ప్రత్యర్థి స్థానాన్ని ‘ఖాళీ’గా చూపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి పాకిస్థాన్ సూపర్ లీగ్ జట్టు కరాచీ కింగ్స్ చెస్ ఆట నేపథ్యంగా స్పందించింది. చెస్ బోర్డుకు ఓవైపు పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సల్మాన్ ఆఘా ఫోటోను గ్రాఫిక్ డిజైన్ చేసి..భారత్ స్థానాన్ని ఖాళీగా ఉంచింది.
ఇవి కూడా చదవండి
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్
ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి