Share News

Slow Over Rate: ఇంగ్లండ్‌కు రెండు పాయింట్ల కోత

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:07 AM

లార్డ్స్‌లో భారత్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌కు పాల్పడిన ఇంగ్లండ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. రెండు వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్లు కోత విధించడంతోపాటు...

Slow Over Rate: ఇంగ్లండ్‌కు రెండు పాయింట్ల కోత

  • స్లో ఓవర్‌ రేట్‌ జరిమానా కూడా..

లండన్‌: లార్డ్స్‌లో భారత్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌కు పాల్పడిన ఇంగ్లండ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. రెండు వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్లు కోత విధించడంతోపాటు ఇంగ్లండ్‌ జట్టు మ్యాచ్‌ ఫీజులో 10 శాతం జరిమానాగా విధించింది. నిర్ణీత సమయంలో బౌల్‌ చేయాల్సిన ఓవర్ల కంటే రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో మ్యాచ్‌ రెఫరీ చర్యలు తీసుకొన్నాడు. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్‌ మూడో స్థానానికి పడిపోయింది. మూడో టెస్ట్‌లో టీమిండియాపై ఇంగ్లండ్‌ 22 పరుగుల తేడాతో గెలిచింది. కాగా, ఐసీసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఇరుజట్లూ ఈ తప్పిదం చేశాయి. కానీ, ఒక్క టీమ్‌పైనే చర్యలు తీసుకోవడమేంటో నాకు అర్థం కావడం లేదు’ అని వాన్‌ ఎక్స్‌లో పోస్టు చేశాడు.

ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 17 , 2025 | 04:09 AM