Share News

England Pakistan Womens World Cup: వరుణుడి ఖాతాలో మరొకటి

ABN , Publish Date - Oct 16 , 2025 | 04:32 AM

మహిళల ప్రపంచ కప్‌లో మరో మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. ఇంగ్లండ్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌ అర్ధంతరంగా రద్దయింది. దాంతో రెండు జట్లకు చెరో పాయింట్‌ కేటాయించారు...

England Pakistan Womens World Cup: వరుణుడి ఖాతాలో మరొకటి

నేటి మ్యాచ్‌

ఆస్ట్రేలియా X బంగ్లాదేశ్‌

మ.3 నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో

  • ఇంగ్లండ్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ రద్దు

  • మహిళల వన్డే వరల్డ్‌కప్‌

కొలంబో: మహిళల ప్రపంచ కప్‌లో మరో మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. ఇంగ్లండ్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌ అర్ధంతరంగా రద్దయింది. దాంతో రెండు జట్లకు చెరో పాయింట్‌ కేటాయించారు. వర్షంవల్ల మ్యాచ్‌ను 31 ఓవర్లకు కుదించగా..మొదట ఇంగ్లండ్‌ 133/9 స్కోరు చేసింది. ఛేదనలో పాకిస్థాన్‌ 6.4 ఓవర్లలో 34/0 స్కోరుతో ఉన్న దశలో మరోసారి భారీ వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 25 ఓవర్లలో 79/7 స్కోరుతో ఉన్న దశలో వర్షం వల్ల ఆటకు మూడున్నర గంటలు అంతరాయమేర్పడింది. దాంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను 31 ఓవర్లకు కుదించారు. చివరి ఆరు ఓవర్లలో డీన్‌, ఆర్లాట్‌ 54 పరుగులు జోడించి జట్టుకు ఓ మోస్తరు స్కోరు అందించారు. కాగా..టోర్నీలో వర్షం వల్ల ఫలితం తేలని మూడో మ్యాచ్‌ ఇది. మంగళవారంనాడు శ్రీలంక-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ కూడా రద్దయింది. అంతకుముందు ఈనెల నాలుగున శ్రీలంక, ఆస్ట్రేలియా నడుమ ప్రేమదాస స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌ కూడా వర్షంతో రద్దు ఖాతాలో చేరింది.

ఈ వార్తలు కూడా చదవండి...

జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 16 , 2025 | 04:32 AM