Ashes Series Third Test Match: ఓటమి దిశగా ఇంగ్లండ్
ABN , Publish Date - Dec 21 , 2025 | 06:41 AM
ఏదో అద్భుతం జరిగి లోయరార్డర్ బ్యాటర్లు కాపాడితే తప్ప..ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌ను చేజార్చుకోవడం ఇంగ్లండ్‌కు లాంఛనమే కానుంది...
లక్ష్యం 435ఫ ప్రస్తుతం 207/6
అడిలైడ్: ఏదో అద్భుతం జరిగి లోయరార్డర్ బ్యాటర్లు కాపాడితే తప్ప..ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌ను చేజార్చుకోవడం ఇంగ్లండ్‌కు లాంఛనమే కానుంది. మూడో టెస్టులో 435 పరుగుల ప్రపంచ రికార్డు లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టు నాలుగో రోజైన శనివారం ఆఖరికి 207 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. 4 వికెట్లే చేతిలో ఉండగా..మరో రోజంతా ఆ జట్టు ఆడాలి. క్రాలే (85), రూట్ (39), బ్రూక్ (30) రాణించారు. కమిన్స్, లియాన్ చెరో 3 వికెట్లు తీశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 271/4తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 349 పరుగులకు ఆలౌటైంది. జోష్ టంగ్ 4, కార్స్ 3 వికెట్లు సాధించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 371, ఇంగ్లండ్ 286 రన్స్ చేశాయి.
ఇవీ చదవండి:
T20 World Cup 2026: టీ20 భారత జట్టు ప్రకటన.. గిల్‌కు షాక్..
నేను కోలుకుంటున్నా.. త్వరలోనే మైదానంలోకి వస్తా: యశస్వి జైస్వాల్