England Cricket Team: 6 రోజులు తాగుతూనే ఉన్నారు
ABN , Publish Date - Dec 24 , 2025 | 06:10 AM
యాషెస్ సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లండ్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అడిలైడ్‌లో సిరీస్ నిర్ణాయక మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓడిన తర్వాత సంచలన...
ఇంగ్లండ్ క్రికెటర్లపై తీవ్ర విమర్శలు
బ్రిస్బేన్: యాషెస్ సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లండ్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అడిలైడ్‌లో సిరీస్ నిర్ణాయక మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓడిన తర్వాత సంచలన విషయాలు బయటికొచ్చాయి. రెండు-మూడు టెస్ట్‌ల మధ్య వచ్చిన 9 రోజుల విరామంలో ఇంగ్లిష్ ప్లేయర్లు కొందరు ఆరు రోజులపాటు ఏక ధాటిగా మద్యం తాగుతూనే ఉన్నారని సమాచారం. రెండో టెస్ట్ ముగిసిన తర్వాత కొందరు ఇంగ్లిష్ ఆటగాళ్లు బ్రిస్బేన్‌లో రెండు రోజులపాటు పూటుగా మద్యం సేవించగా.. ఆ తర్వాత నూసా బీచ్ రిసార్టులో ఉన్న నాలుగు రోజులు కూడా ఇదే పనిలో ఉన్నారు. మద్యం మత్తులో బెన్ డకెట్.. టీమ్ హోటల్ దారి తప్పడం, రోడ్డు పక్కన కూడా మందు తాగుతున్న కొన్ని వీడియోలు నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, మితిమీరిన తాగుడు ఆరోపణలపై విచారణ చేస్తామని ఇంగ్లండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ చెప్పాడు.
ఇవీ చదవండి:
టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లో దీప్తి శర్మ!
టీ20ల్లో నయా రికార్డు.. ఒకే ఓవర్‌లో 5 వికెట్లు