ఇంగ్లండ్‌దే సిరీస్
ABN , Publish Date - Jun 09 , 2025 | 05:09 AM
వెస్టిండీ్‌సతో మూడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టీ20లో ఆతిథ్య జట్టు నాలుగు వికెట్లతో నెగ్గింది...
రెండో టీ20లోనూ వెస్టిండీస్ ఓటమి
బ్రిస్టల్: వెస్టిండీ్‌సతో మూడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టీ20లో ఆతిథ్య జట్టు నాలుగు వికెట్లతో నెగ్గింది. మొదట వెస్టిండీస్ 20 ఓవర్లలో 196/6 స్కోరు చేసింది. కెప్టెన్ హోప్ (49), చార్లెస్ (47), పొవెల్ (34) రాణించారు. ల్యూక్ ఉడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఇంగ్లండ్ 18.3 ఓవర్లలో 199/6 స్కోరు చేసి గెలుపొందింది. బట్లర్ (47), కెప్టెన్ బ్రూక్ (34), డకెట్ (30), బాంటన్ (30 నాటౌట్) తలో చేయి వేశారు. అల్జరి జోసెఫ్ రెండు వికెట్లు తీశాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి